విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఆస్తుల విక్రయం నుంచి బ్యాంకులు రూ.13,109.17 కోట్లను రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో  తెలిపారు. లోక్‌సభ ఆమోదించిన గ్రాంట్ల సప్లిమెంటరీ డిమాండ్‌ల రెండో విడత చర్చకు సమాధానమిస్తూ సీతారామన్ ఈ విషయాన్ని చెప్పారు. సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 3.73 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి లభించిందని ఆమె తెలిపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి బ్యాంకులు రికవరీపై సీతారామన్ మాట్లాడుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందించిన సమాచారం ప్రకారం జూలై 2021 నాటికి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ఆస్తుల అమ్మకాల నుంచి మొత్తం రూ.13,109.17 కోట్లు రికవరీ అయ్యాయని చెప్పారు. జూలై 16, 2021న మాల్యా ఇతరులకు చెందిన ఆస్తుల విక్రయం ద్వారా రికవరీ రూ.792 కోట్లు అని ఆమె తెలిపారు.  గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి దాదాపు రూ.5.49 లక్షల కోట్ల రికవరీని సాధించామన్నారు. డిఫాల్టర్లు, దేశం విడిచి పారిపోయిన వ్యక్తుల నుంచి రికవరీ చేశామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిటర్ల సొమ్ము సురక్షితమని ఆమె అన్నారు.


Also Read: Aishwarya Rai Summoned: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ


లోక్ సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ధరల పెరుగుదల సహా పలు అంశాలపై ఆమె స్పందిస్తూ.. ఎడిబుల్ ఆయిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.  రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2019-20 సంవత్సరానికి సంబంధించి 86.4 శాతం మొదటి ఎనిమిది నెలల్లో కేంద్రం ఇప్పటికే బదిలీ చేసిందని చెప్పారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి నిధులు అందించామన్నారు. కోవిడ్ సమయంలో అదనంగా రూ. 15,000 కోట్లు అందించామన్నారు. నవంబర్ 30, 2021 నాటికి రాష్ట్రాల మొత్తం నగదు నిల్వలు దాదాపు రూ. 3.08 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి చెప్పారు. రాష్ట్రాల వద్ద నగదు నిల్వలను కలిగి ఉన్నాయన్నారు. 28 రాష్ట్రాల్లో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్‌ని కలిగి ఉన్నాయన్నారు. గ్రాంట్ల కోసం సప్లిమెంటరీ డిమాండ్ల గురించి సీతారామన్ మాట్లాడుతూ రూ. 3.73 లక్షల కోట్ల అదనపు వ్యయం అవుతుందని చెప్పారు.


Also Read:  గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్


ఎయిర్ ఇండియాకు పెద్ద మొత్తంలో టిక్కెట్ ఖర్చులు, అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా ఎరువుల సబ్సిడీ పెరగడం వల్ల రూ. 2.99 లక్షల కోట్లు అదనపు నగదు అవసరం అవుతుందన్నారు. ఆయిల్ బాండ్ల కోసం ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.93,685 కోట్లు చెల్లించిందని సీతారామన్ చెప్పారు. ఆయిల్ బాండ్ల మెచ్యూర్ అయ్యే వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. 


Also Read: షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పౌడర్ తయారీ... భారీగా జీడి పిక్కల తుక్కు పట్టివేత...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి