కొంతమంది దొంగలు దొరికితే బాత్రూంలో పెనాయిల్ కూడా పట్టికెళ్లిపోతారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఓ రైలు ఇంజిన్‌నే దొంగతనం చేశాడు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? మరదే ట్విస్ట్. ఇంతకీ ఆ వ్యక్తి పని చేసేది కూడా ర్వైల్వేశాఖలోనే. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.
అదెలా?
బిహార్ పుర్ణియా కోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సమస్తిపుర్ లోకో డీజిల్ షెడ్లో రాజీవ్ రంజన్ ఝా అనే అతను ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను పనిచేసే స్టేషన్లో చిన్నరైల్వే ట్రాక్‌పై తిరిగే ఓ పాత రైలు ఇంజిన్ ఉంది. దానిపై కన్నేసిన రాజీవ్.. పై అధికారులు నుంచి వచ్చినట్లు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించేశాడు.
పాత సామాన్లకు..
నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్ డిసెంబర్ 14న గ్యాస్ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను ముక్కలుగా చేసేశాడు. ఇందుకు ఓ హెల్పర్ కూడా అతనికి సాయం చేశాడు. కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకునే సరికి నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. ఇంజిన్ పాతదైపోయిందని, విడిభాగాలుగా చేసి డీజిల్ షెడ్‌కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు అదేశించారని వారిని నమ్మించాడు.
ఆ పత్రాల ఆధారంతో ఏకంగా రైలు ఇంజిన్‌ను పాత సామాను కొనుగోలు చేసే వారికి అమ్మేశాడు రాజీవ్. ఇందు కోసం అతనికి స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్, ఓ హెల్పర్ కూడా సహకరించారు.
ఎలా తెలిసింది?
రాజీవ్‌పై స్టేషన్ అధికారులకు అనుమానం రావడంతో డీజిల్ షెడ్‌కు వెళ్లి చూశారు. అక్కడ ఇంజిన్ పరికరాలు లేవు. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తమ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు చెప్పారు. దీంతో స్టేషన్ మాస్టర్, ఉద్యోగులు కలిసి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించేసరికి అసలు విషయం బయటకు వచ్చింది.
Also Read: Aishwarya Rai Summoned: ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్.. పనామా పత్రాల కేసులో ప్రశ్నల వర్షం
Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి