సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న థ్రిల్లర్ సినిమా 'యశోద'. ఇందులో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. సమంత, ఉన్ని ముకుందన్ కలయికలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీళ్లిద్దరూ 'జనతా గ్యారేజ్'లో కలిసి నటించారు. అందులో మోహన్ లాల్ కుమారుడిగా ఉన్ని ముకుందన్ కనిపించారు. మరి, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. 'శాకుంతలం'లోనూ మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో సమంత నటించారు. బ్యాక్ టు బ్యాక్... రెండు సినిమాల్లో మలయాళ నటులతో సమంత స్క్రీన్ షేర్ చేసుకోనుండటం యాదృశ్చికమే. ఇంతకు ముందు అనుష్కకు జోడీగా ఆయన 'భాగమతి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె చిత్రీకరణ ప్రారంభించారు. తెలుగు సహా దక్షిణాది భాషలు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో 'యశోద' సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో హరి, హరీష్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "సమంత ఇంతకు ముందెన్నడూ నటించనటువంటి పాత్రను మా సినిమాలో పోషిస్తున్నారు. 'యశోద' పక్కా థ్రిల్లర్ సినిమా. మధుబాల పాత్రలో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్, మరో ప్రధాన పాత్రలో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో అది పూర్తి అవుతుంది. ఆ తర్వాత జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మార్చికి షూటింగ్ అంతా పూర్తి చేస్తాం" అని చెప్పారు.
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా! ఆమె రోల్ ఏంటంటే?
ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తుండగా... పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు రాశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి చింతా గోపాలకృష్ణారెడ్డి సహ నిర్మాత. ఈ సినిమాకు మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. 
Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క్రిష్ మీటింగ్‌... 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' గురించి కొత్త అప్‌డేట్‌!
Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
Also Read: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
Also Read: గాల్లోంచి అలా అలా... ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ అదుర్స్ అంతే! మీరూ వీడియో చూడండి!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి