ధ్యానం, ఇతర పంటల కొనుగోళ్లపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పంటల కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) క్రియాశీలంగా వ్యవహరించాలని సీఎం జగన్ అన్నారు. రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర లభించాలన్నారు. రైతులకు ఆర్బీకేల ద్వారా సేవలందించడంలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. రైతులతో తరచుగా సమావేశమవుతూ అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తు్న్నామని సీఎం జగన్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదన్నారు. ధాన్యం నాణ్యత పరిశీలనలో మోసాలు జరగకుండా చూడాలన్నారు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
21 రోజుల్లో పేమెంట్స్ చెల్లింపు
ధాన్యం కొనుగోలు కోసం రైతు భరోసా కేంద్రాల్లో ఐదుగురు సిబ్బంది ఉండాలని సీఎం జగన్ అన్నారు. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు ఉండాలని సూచించారు. ఈ సిబ్బంది రైతుల దగ్గరకు వెళ్లి కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలన్నారు. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలన్నారు. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో నగదు చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చూసించారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారో, లేదో పరిశీలించాలని, ప్రతీ కొనుగోలు కేంద్రంలో తగిన సిబ్బంది ఉన్నారో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
Also Read: కోడి పందాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ లేఖ.. 5 రోజులు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్
ప్రత్యామ్నాయ పంటలకు బోనస్..!
ధ్యానం, ఇతర పంటల కొనుగోలుకు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను ఏర్పాటుచేయాలని సీఎం జగన్ అన్నారు. ఆర్బీకేకి వచ్చే ఫిర్యాదులను విచారణ జరిపి పరిష్కరించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ల నుంచి కూడా పంటల కొనుగోలుపై నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. సీసీఆర్సీ కార్డ్స్ లపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోజుకు సగటున 42,237 మెట్రిక్ టన్నుల ధ్యానం కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు పండించే వారికి బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి