Mudragada Letter To AP CM YS Jagan: చాలా సున్నితమైన విషయం అంటూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటామని.. పోలీసులు ఇబ్బంది పెట్టకుండా తమకు ఐదు రోజుల చొప్పున పర్మిషన్‌కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇప్పించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ముద్రగడ కోరారు. జల్లికట్టు కంటే తాము చేసే ఉత్సవాలు ప్రమాదకరమైనవి కావని గుర్తుచేశారు.


‘చాలా సున్నితమైన విషయం మీ (ఏపీ సీఎం వైఎస్ జగన్) దృష్టికి తీసుకొస్తున్నాను. గ్రామాలలో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా చాలా ఘనంగా చేయడం ఈ ప్రాంత వాసులకు అలవాటుగా వస్తున్న ఆచారం. ఎడ్లు, గుర్రం, కోడి పందాలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువులు లాగే పందాలు, ఆటల పోటీలు, జాతరలు వగైరాలతో సుమారు 5 రోజులు ఇక్కడ వేడుకలు జరుపుకుంటారు. నాకు తెలిసి 1978 నుండి ఇంచుమించుగా 2004 వరకు ఎస్‌ఐ తరువాత డీఎస్పీ ఆ తరువాత ఎస్పీ.. ఆ తరువాత ఏలూరు డి.ఐ.జి, ఆఖరిగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రిని పర్మిషన్ అడిగేవాడిని. వారు ఇందుకు అంగీకరించేవారు.


గత కొంతకాలం నుంచి సంక్రాంతి, ఉగాది పండుగ  ఉత్సవాలలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చివరి నిమిషంలో పర్మిషన్ ఇచ్చామని తూతూ మంత్రంగా చెబుతున్నారు. దీనివల్ల ఉత్సవాలు జరుపుకోలేకపోతున్నాం. ఇదే సమయంలో ప్రజలతో పాటు పోలీసులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారని గమనించాలి. కనుక ఈ రెండు పండుగ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంక్రాంతికి, ఉగాదికి 5 రోజులు చొప్పున శాశ్వతంగా నిర్వహించుకునే విధంగా ప్రకటన చేయాలని పర్మినెంట్ ఆర్డర్సు ఇప్పించాలని కోరుతున్నాం. 


ఆ పండుగల సమయంలో ప్రజలకు చాలా వరకు ఏ పని ఉండదు. అందువల్ల ఉత్సహాంగా ఈ వేడుకలలో పాల్గొంటారు. రెగ్యూలర్‌గా మేం పండుగలకు చేసే ఉత్సవాలు ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు, సంబరాలు కావు అని గుర్తించండి. దయచేసి పండుగలకు ప్రజలను జైలుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలని కోరుతున్నానంటూ’ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  
Also Read: Bigg Boss 5 Telugu Winner: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. విన్నర్ గా సన్నీ.. రన్నరప్ గా షణ్ముఖ్.. 
Also Read: Weather Updates: బీ అలర్ట్.. రెండు వైపుల నుంచి వీస్తున్న చల్లగాలులు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ..!
Also Read: Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి