AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తుండగా.. రాయలసీమలో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీలో అన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి రోజురోజుకూ పెరిగిపోతోంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో నేటి నుంచి రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజుల వరకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో ఉష్ణోగ్రతలలో స్వల్ప వ్యత్యాసం ఏర్పడుతుంది. చల్లని గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఏజెన్సీ ఏరియాలో మరింత పడిపోనున్నాయి. వర్షాలు కురిసే అవకాశం లేదు కనుక మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.






దక్షిణ కోస్తాంధ్రంలో వాతావరణం పొడిగా మారిపోయింది. బలమైన గాలులు ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. కొన్ని  సైతం వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గుతాయి. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. నేటి నుంచి నుంచి మూడు రోజులవరకు సీమలో వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ అవుతాయిని తెలిపారు. మరికొన్ని రోజులపాటు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదు.
Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!
Also Read: Gold-Silver Price: రెండోరోజూ స్థిరంగా బంగారం.. నేల చూపులు చూసిన వెండి.. నేటి ధరలు ఇవీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి