చల్లని శీతాకాలపు ఉదయం ఓ వెచ్చని కాఫీ తాగితే... ఆ కిక్కే వేరు. మనల్ని చురుగ్గా చేయడంతో పాటూ తక్షణమే శక్తినిస్తుంది. ఏకాగ్రత కుదిరేందుకు సహకరిస్తుంది. కానీ అందులో ఉండే కెఫీన్ మాత్రం బరువు పెరిగేందుకు కారణమవుతుంది. నిద్రపట్టనివ్వదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కాఫీ తయారుచేసే విధానాన్ని మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాఫీ బరువు తగ్గేందుకు సహకరించేదిగా కూడా తయారుచేసుకోవచ్చు. 


చక్కెర వాడద్దు
బరువు తగ్గాలనుకుంటే కాఫీలో చక్కెర వేసుకోవడం పూర్తిగా మానేయండి. చక్కెర అంటే తెల్లని చక్కెర మాత్రమే కాదు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవద్దు. ఇది కాఫీలో  కలిసి కెలోరీల సంఖ్యను పెంచుతుంది. చక్కెర ఎనర్జీ క్రాష్ కి కారణమవుతుంది. దీనివల్ల మీకు నీరసంగా అనిపించవచ్చు. పంచదారకు బదులు బెల్లం కలిపి తాగండి. 


క్రీమ్ జోడించవద్దు
కాపీ ఆరోగ్యకరంగా ఉండాలంటే దానికి క్రీమ్ చేర్చడం మానుకోండి. స్ప్రింక్ల్స్, సిరప్ లను కూడా చాలా తక్కువగా చేర్చాలి. ఈ టాపింగ్స్ శుద్ధి చేసిన చక్కెరతో చేస్తారు. కాబట్టి వాటిని దూరం పెట్టాలి. ఏదైనా కేఫ్‌లో కాఫీ ఆర్డర్ చేసేటప్పుడు ఈ సూచనలు ఇవ్వండి. 


అతిగా తాగకండి
కాఫీ జీవక్రియను పెంచుతుంది. అలాగే కొన్ని అదనపు కేలరీలను కరిగించడంలో కూడా మీకు సహాయపడుతుంది. కానీ కాఫీని అధికంగా తాగడం వల్ల చెడు ప్రభావం పడుతుంది. ఒక వ్యక్తి రోజులో రెండు కప్పుల కాఫీని మాత్రమే తాగాలి. దీనికి మించి తాగితే కడుపునొప్పి, మూర్ఛ, రక్తంలో ఆమ్ల స్థాయిలు పెరగడం, గుండె దడ పెరగడం వంటివి కలగవచ్చు.


పాలు అధికంగా వద్దు
పాలు ఆరోగ్యకరమైనవే కానీ బరువు తగ్గాలనుకునే వారు పాలు అతిగా తాగకూడదు. కాఫీలో ఎక్కువ మోతాదులో పాలు కలుపుకోవద్దు. బరువు తగ్గాలనుకునే వారు పాలు కలుపుకోకుండా బ్లాక్ కాఫీ తాగడం మంచిది. ఇలా చేయడం వల్ల కేలరీల సంఖ్యను పెంచకుండానే మిమ్మల్ని శక్తివంత చేస్తుంది. 


ఆ టైమ్ తరువాత తాగవద్దు
కాఫీని మధ్యాహ్నం రెండు గంటల తరువాత తాగకపోవడమే మంచిది. ఇలా తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. అర్థరాత్రి వరకు మేల్కొని ఉండేలా చేస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 


Read Also: నిద్రలో మీకు ఈ రెండు సమస్యలు ఉన్నాయా... చాలా డేంజర్ అంటున్న కొత్త అధ్యయనం
Read Also: 2021 Trend: 2021లో విటమిన్ సి ఎందుకు అంతగా ట్రెండయ్యింది? అందాన్ని కాపాడే విటమిన్ ఇదొక్కటేనా?
Read Also: మొక్కజొన్న గింజలతో ఇంట్లోనే కార్న్ సూప్... తాగితే చలి పరార్
Read Also: చలికాలంలో చేపలు తినడం లేదా... తినాల్సిందే, తింటే ఎన్నిలాభాలంటే...
Read Also: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి