ఒమిక్రాన్ ఏ వ్యాక్సిన్‌ను తట్టుకుంటుంది? ఏ వ్యాక్సిన్ ఈ కొత్త వేరియంట్ పై పనిచేస్తుంది? బూస్టర్ డోస్ అవసరమా? ఇలా ఇప్పుడు మళ్లీ వ్యాక్సిన్లపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఓ వ్యాక్సిన్ ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు కొత్త పరిశోధన తేల్చింది. ఆ వ్యాక్సిన్ ఏదంటే ‘స్పుత్నిక్ V’. ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కి వ్యతిరేకంగా బాగా పనిచేస్తున్నట్టు కనుగొన్నారు పరిశోధకులు. దీన్ని బూస్టర్ డోస్‌గా తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు రష్యాలోని గమలేయా సెంటర్లో నిర్వహించిన ప్రాథమికం ప్రయోగంలో తేలింది.
Omicron వేరియంట్‌కు వ్యతిరేకంగా స్పుత్నిక్ V అధిక వైరస్ న్యూట్రలైజింగ్ చర్యను ప్రదర్శిస్తుందని కూడా ప్రయోగంలో తెలిసింది. వేరియంట్ తీవ్రంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశాన్ని, ఆసుపత్రిలో చేరే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుందని ఫలితం వచ్చింది. దీంతో రష్యాలోని ప్రజలు బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని జర్మనీకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ వైరాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.
ఈ ప్రయోగంలో రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వందమందిని ఎంపిక చేసుకుని వారికి బూస్టర్ డోస్ గా స్పూత్నిక్ Vని ఇచ్చారు. బూస్టర్ డోస్ ఇచ్చాక వారిలో ఒమిక్రాన్ వైరస్లను న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి అయినట్టు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ను దాదాపు 71 దేశాలలో గుర్తించారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read also: బొప్పాయి తింటే ఆరోగ్యమే కానీ... ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదు
Read also: చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు
Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?
Read also: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి