బొప్పాయి అన్ని కాలాల్లో దొరికే పండే కాదు, ధరలో కూడా తక్కువ. పేదలకు కూడా దీని ధర అందుబాటులోనే ఉంటుంది. అందులోనూ ఇందులో ఉండే పోషకాలు ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, పపైన్ లాంటి ఎంజైమ్‌లు మానవశరీరానికి అవసరమైనవి. క్యాన్సర్, బీపీ సమస్యలు ఉన్నవారికి ఇంకా మంచిది. సాధారణ వ్యక్తులు ఈ బొప్పాయిని ఎంత తిన్నా ఫర్వలేదు కానీ కొంతమంది మాత్రం దీనికి దూరంగా ఉండాలి. 


ఎవరెవరు తినకూడదంటే...
1. థైరాయిడ్ సమస్య ఉన్నవారు అందులోనూ ముఖ్యంగా హైపో థైరాయిడిజం సమస్య ఉన్న వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. 
2. కొందరిలో గుండె దడ, గుండె కొట్టుకోవడంలో తేడా సమస్య ఉన్నవారు కూడా బొప్పాయిపండ్లకు దూరంగా ఉండాలి. 
3. ఇక గర్భం ధరించాలనుకుంటున్నవారు, గర్భం ధరించిన వారు కూడా బొప్పాయి పండును తినకూడదు. ఇందులో ఉండే పపైన్ నేరుగా పిండంపై ప్రభావం చూపిస్తుంది.  అలాగే గర్భం ధరించాలనుకుంటున్నవారిలో అయితే ఆ అవకాశాలు తగ్గేలా చేస్తుంది. 
4. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా బొప్పాయి పండుకు దూరంగా ఉండాలి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది.  
5. తరచూ అలెర్జీల బారిన పడే వారు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇందులో లేటెక్స్ అనే పదార్థం అలెర్జీలకు కారణమవుతుంది. తిన్నవెంటనే ఏదైనా తేడాగా అనిపించినా, చర్మంపై మార్పు కనిపించినా బొప్పాయిని తినడం మానేయాలి. 
6. లోబీపీ ఉన్న వాళ్లు కూడా ఈ పండుకు దూరంగా ఉండాలి. లేకపోతే మరింతగా బీపీ పడిపోయే అవకాశం ఉంది. 
ఈ సమస్యలు ఉన్నవారంతా బొప్పాయి పండును దూరంగా పెట్టడం మంచిది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  


Read also:  చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు


Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?


Read also: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?


Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి