ఆధునిక కాలంలో బరువు పెరగడం చాలా సులువైపోయింది. దీంతో చాలా మంది కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని దూరంగా పెడుతున్నారు. అందులో ముఖ్యమైనది అన్నం. రాత్రిపూట చపాతీలు తినడం మొదలుపెట్టారు. అయితే కేవలం చపాతీలు మాత్రమే తినడం వల్ల వచ్చే ఉపయోగం తక్కువ. శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు దూరం పెట్టడం వల్ల శరీరం నీరస పడే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరిగేలా చపాతీలను తయారుచేసుకుని తింటే చాలా రోగాలు దరి చేరవు. 


కేవలం గోధుమపిండితో మాత్రమే చపాతీలను తయారుచేసుకుని తినడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందులో శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే కారకాలు తక్కువే ఉంటాయి. కాబట్టి మీరే ప్రత్యేకంగా పిండిని ఆడించుకుని దాచుకోవడం ఉత్తమం. గోధుమపిండితో పాటూ కొన్ని జొన్నలు, సజ్జలు, రాగులు, బార్లీ, సోయాబీన్స్, ఓట్స్, శెనగపప్పు, కప్పు బాదం పప్పులు కూడా వేసి పొడిలా చేసుకుని దాన్ని ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. అయితే గోధుమపిండి తప్ప మిగతావన్నీ కేవలం 50 గ్రాములు మాత్రమే వేసుకోవాలి. పిండి ఆడించాక కాస్త గాలికి ఆరబెట్టి, పొడిగా మారాక డబ్బాలో వేయాలి. లేకుంటే త్వరగా పురుగు పట్టేస్తుంది. 


ఇలా చేయండి...
చపాతీలు చేసుకునేటప్పుడు ఓసారి పాలకూరతో, ఓసారి కొత్తి మీరతో, ఇంకోసారి పుదీనాతో, మెంతికూరతో... ఇలా కలుపుకుని చేసుకుంటే చాలా ఆరోగ్యం. కొత్తిమీర, పుదీనా తరుగును నేరుగా చపాతీ పిండిలో కలుపుకున్నా ఫర్వాలేదు కానీ, మిగతా ఆకుకూరలను మాత్రం కాసేపు కాస్త నూనెలో వేయించి మెత్తని పేస్టులా చేసి అప్పుడు పిండిలో కలుపుకోవాలి. 


ఎంత ఆరోగ్యమో
ఇలా రోజూ చపాతీలను తినడం బరువు తగ్గడమే కాదు, మంచి ఆరోగ్యం కూడా అందుతుంది. షుగర్ వ్యాధిగ్రస్థులకు ఇలాంటి చపాతీలు మేలుచేస్తాయి. శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  


Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?


Read also: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?


Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి


Read also: షాకింగ్.. ఆలూ చిప్స్ ప్యాకెట్లకు ప్యాకెట్లు లాగిస్తున్నారా? ఈ రోగాలకు వెల్‌కమ్ చెప్పినట్లే.. హార్వర్డ్ అధ్యయనం


Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే