స్నాక్స్ అనగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి తిండి పదార్థం ఆలూచిప్స్. ఈ చిప్స్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లపై సాగుతోంది. రోజూ చిప్స్ తినే పిల్లలు ఎంతో మంది. కానీ అవెంత అనారోగ్యకరమో తెలుసా? దీర్ఘకాలంలో ఎంతగా ప్రభావం చూపిస్తున్నాయో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం. వీటిని పిల్లలతో పాటూ పెద్దలు కూడా అధికంగా తింటున్నారు. కొన్ని పరిశోధనలలో ఆలూ చిప్స్ కు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.


1. బరువు పెరగడం
రోజుకో చిప్స్ ప్యాకెట్ లాగిస్తున్నారా... అలా రోజూ తింటే సులువుగా బరువు పెరుగుతారు. డీకిన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఉప్పగా ఉండే చిప్స్ పూర్తిగా మానేయాలి. హార్వర్డ్ అధ్యయనంలో కూడా బంగాళా దుంప చిప్స్ వల్ల బరువు పెరుగుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నట్టు గుర్తించారు. 


2. బానిస అయిపోతారు
చిప్స్ ప్యాకెట్ పట్టుకున్నాక నియంత్రణ లేకుండా తింటున్నారంటే అవి మిమ్మల్ని అప్పటికే బానిస చేసుకున్నట్టే. తరచూ చిప్స్ తినేవారు వాటికి అలవాటు, ఒక్క రోజు తినకపోయినా ఏదో వెలితిగా,  ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. 


3. బీపీని పెంచేస్తాయి
ప్రఖ్యాత మాయో క్లినిక్ ప్రకారం... చిప్స్ తరచూ తినే వారిలో అధిక రక్తపోటు త్వరగా వస్తుంది. అలాగే దేనిమీద ఏకాగ్రత కుదరదు. చిత్త వైకల్యం ఎక్కువవుతుంది. వాటిలో ఉండే అధిక సోడియం వల్ల ఇలా జరుగుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం... ఈ స్నాక్స్‌‌లో ఉండే సోడియం రక్త నాళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.


4. క్యాన్సర్ వచ్చే అవకాశం
అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ ప్రకారం ప్రాసెస్ చేసిన ఆహారాలలో అక్రిలమైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణితులకు కారణమవుతుంది. చిప్స్ అధిక ప్రాసెస్ చేసిన ఆహారం కిందకి వస్తుంది. కాబట్టి చిప్స్‌కు దూరంగా ఉండడం చాలా ఆరోగ్యకరం.   


5. గుండె జబ్బులు
ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం గుండె సంబంధ వ్యాధులకు కారణమవుతుంది.  చిప్స్‌లో ఫ్యాట్ అధికంగా ఉంటుంది. తింటే దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. 


6. స్ట్రోక్ రావచ్చు
మీ కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చిన సందర్భాలు ఉంటే, వారి వారసులుగా మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చిప్స్ లాంటి కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పదార్థాల వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. 


7. గర్భం ధరించడం కష్టమవుతుంది
సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ చెప్పిన దాని ప్రకారం ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉండే ఆహారాలు గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి. చిప్స్‌లో ఇలాంటి చెడు కొవ్వులు అధికం. వీటిని మహిళలు ఏళ్లకుఏళ్లు తింటుంటే పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం కష్టమవుతుంది.


8.  డిప్రెషన్ బారిన పడొచ్చు
వీటిని అధికంగా తినేవారిలో మానసిక ఆందోళన వచ్చే అవకాశం ఉంది. అలాగే డిప్రెషన్‌కు కూడా గురికావచ్చు. 


Note: ఇది ABP Desam ఒరిజనల్ కంటెంట్. copyright కింద చర్యలు తీసుకోబడతాయి. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  


Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే



Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి