బ్రేక్‌ఫాస్ట్... రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. మధ్యాహ్నం, రాత్రి ఎగ్గొట్టినా ఫర్వాలేవు కానీ, ఉదయం అల్పాహారం మాత్రం స్కిప్ చేయకూడదని చెబుతుంటారు. అలాగే ఉదయం తినే ఆహారం మీ బరువుపై కూడా ప్రభావం చూపిస్తుంది. మనుషులు బరువు పెరగడం మొదలైనప్పుడు... ఆ ప్రభావం తొలిగా కనిపించేది పొట్ట మీదే. ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించడం, ప్రొటీన్, ఫైబర్ జోడించడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు చేరడం తగ్గుతుంది. ఉదయం అల్పాహారంగా ఇలాంటి వంటకాలను ప్రయత్నించండి ఫలితం ఉంటుంది.


పెరుగు
పెరుగు తినని వారితో పోలిస్తే, పెరుగుకు ఎక్కువగా తినేవారిలో బరువు కోల్పోవడం అధికంగా కనిపిస్తోంది. ఇందులో ఉండే కాల్షియం కూడా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. తగిన మోతాదులో శరీరంలో చేరిన కాల్షియం కండరాలలో కెలోరీలు కరిగించేందుకు, కొవ్వును విచ్చిన్నం చేసేందుకు సాయపడుతుంది. పెరుగులో ప్రొటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరకొవ్వును తగ్గించేందుకు కీలకమైన అంశం. అయితే పెరుగులో చక్కెర వంటివి కలుపుకుని తినవద్దు. 


ఉప్మా
ఉప్మాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరంగా బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే రవ్వ సహజంగానే తక్కువ కొవ్వును  కలిగి ఉంటుంది. అలాగే దానిద్వారా లభించే కాస్త కొవ్వు కూడా మంచిదే. ఉప్మాను తక్కువ నూనెతో వండుకుంటే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అవ్వడం ఖాయం. 


ఆమ్లెట్
రెండు ఉడకబెట్టిన గుడ్లు అల్పాహారంగా తీసుకునేందకు సరైన ఎంపిక. అవసరమైన పోషకాలు, పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. అలాగే కూరగాయలు వేసుకుని ఆమ్లెట్ గా వేసుకున్నా కూడా ఆరోగ్యకరమే. ఆమ్లెట్ తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. 


పోరిడ్జ్ 
ఇది ఎక్కువ మంది ఇళ్లల్లో పిల్లలకోసం చేస్తుంటారు. వోట్స్ తో చేసే ఈ వంటకం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇందులో కొన్ని పండ్లను కలిపి తింటే మంచి రుచిగానూ ఉంటుంది. లేదా తేనెను కలుపుకోవచ్చు. 


పెసరపప్పు కిచిడీ
ఫైబర్ అధికంగా ఉండే వంటకం ఇది. ప్రోటీన్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడే గొప్ప అల్పాహార ఎంపిక. ఇందులో కాస్త కూరగాయలను జోడించి వండుకుంటే ఆరోగ్యకరమైన పోషకాహారంగా మారుతుంది. బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.


Read also: షాకింగ్.. ఆలూ చిప్స్ ప్యాకెట్లకు ప్యాకెట్లు లాగిస్తున్నారా? ఈ రోగాలకు వెల్‌కమ్ చెప్పినట్లే.. హార్వర్డ్ అధ్యయనం


Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే


Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం


Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి