వాతావరణం చల్లగా ఉంటే చేపలను దూరం పెడతారు చాలా మంది. చికెన్, మటన్ లు తినడానికే ప్రాధాన్యతనిస్తారు. కానీ చలికాలంలో చేపలు తినకూడదని ఎక్కడా చెప్పలేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఉన్నప్పుడు మాత్రమే చేపలను దూరం పెట్టాలి. చలికాలంలో మన రోగనిరోధక శక్తి సాధారణంగానే తగ్గిపోతుంది. కాబట్టి వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తినడం చాలా అవసరం. చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చేపల్లో ఉండే పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
1.చలికాలంలో కీళ్లనొప్పులు అధికమవుతాయి. ఆర్ధరైటిస్, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి శీతాకాలంలో నొప్పులు చుక్కలు చూపిస్తాయి. అలాంటి చేపలను తింటే నొప్పులు తగ్గిపోతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు నొప్పులను తగ్గిస్తాయయి. కనుక ఈ సమస్యలతో బాధపడేవాళ్లు చేపలను దూరం పెట్టవద్దు.
2. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఇన్షెక్షన్ల నుంచి రక్షిస్తాయి. కాబట్టి జలుబు, దగ్గు వంటివి త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
3. చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఒమెగా 3ఫ్యాటీ ఆమ్లాలు ముందుంటాయి. చర్మం పొడిబారడం తగ్గుతుంది.
4. ఊపిరితిత్తులను కాపాడడంలో చేపల్లోని పోషకాలు చాలా మేలు చేస్తాయి.
5. గర్భిణీలకు కూడా చేపలు తినడం చాలా అవసరం. తినకూడదనే నియమాలేవి లేవు.
6. గుండె జబ్బులున్నవారికి కూడా చేపలు మంచి చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. కాబట్టి గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా చేపలను తినాలి.
7. మానసిక ఆందోళనతో బాధపడేవారికి మంచి ఔషధం చేపలు. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారు చేపలను వారానికి రెండు మూడు సార్లు తింటే మంచిది.
8. కంటి చూపు మెరుగుపరచడంతో పాటూ, కళ్లలో మెరుపు నింపుతాయి. చూడగానే ఆకట్టుకునేలా కళ్లు కళకళలాడుతాయి.
9. విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే చేపలు తినాలి. సూర్యరశ్మి వల్లే కాదు చేపల్లో కూడా విటమిన్ డి లభిస్తుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి
Also read: చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు
Also read: నిద్రను రానివ్వకుండా చేసే అలవాట్లు ఇవే... దూరం పెట్టకపోతే పెద్ద రోగాలు రావడం ఖాయం
Also read: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి