దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీసు గెలిచేందుకు ఇదే మంచి తరుణమని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అంటున్నాడు. తమ ఫాస్ట్‌ బౌలర్లపై అత్యంత నమ్మకంగా ఉన్నామని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచులోనూ వారు 20 వికెట్లు తీస్తారని ధీమా వ్యక్తం చేశాడు. బయో బుడగలు సవాళ్లు విసురుతున్నా కొన్నిసార్లు మేలు చేస్తున్నాయని తెలిపాడు. సన్నాహక మ్యాచులు ఆడనప్పటికీ సాధన చేసేందుకు తగిన సమయం దొరికిందని అంటున్నాడు.


'మేం సిద్ధమయ్యేందుకు చాలినంత సమయం దొరికింది. కుర్రాళ్లు ఈ సిరీసు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికాలో మేం తొలి సిరీసు గెలిచేందుకు ఇదే సరైన అవకాశం. అందుకే మేమంతా సిరీసు కోసం ఎదురు చూస్తున్నాం' అని పుజారా అన్నాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ దళమే టీమ్‌ఇండియాకు బలమని అతడు పేర్కొన్నాడు.


'మా పేసర్లే మా బలం. వారు ఇక్కడి పరిస్థితులు, వాతావరణాన్ని చక్కని ఉపయోగించుకొని ప్రతి మ్యాచులో 20 వికెట్లు తీస్తారని మా నమ్మకం. మేం విదేశాల్లో ఎక్కడ పర్యటించినా రెండు జట్ల మధ్య ప్రధానమైన తేడా మా ఫాస్ట్‌ బౌలింగ్‌ దళమే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ సిరీసుల్లో మే అద్భుతంగా ఆడాం. మా బౌలింగ్‌ విభాగం దక్షిణాఫ్రికాలోనూ అదరగొడుతుందని మా విశ్వాసం' అని పుజారా అన్నాడు.


కరోనా మహమ్మారి వల్ల తగినన్ని సాధనా మ్యాచులు ఆడలేకపోతున్నామని నయావాల్‌ చెప్పాడు. అయినప్పటికీ మ్యాచులకు సన్నద్ధం అయ్యేందుకు తగిన సమయం దొరుకుతోందని పేర్కొన్నాడు. కుర్రాళ్లంతా మంచి టచ్‌లో ఉన్నారని వెల్లడించాడు. బయో బుడగల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపాడు. సవాళ్లు ఎదురైనా కొన్ని ప్రయోజనాలూ లభిస్తున్నాయని పేర్కొన్నాడు. ఆటగాళ్లంతా మరింత దగ్గరవుతున్నారని, వారి మధ్య సాన్నిహిత్యం బలపడుతోందని వెల్లడించాడు.






Also Read: Kidambi Srikanth: తెలుగు తేజం మరో సంచలనం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన కిడాంబి శ్రీకాంత్


Also Read: Year Ender 2021: ఈ ఏడాదీ యువరాజ్‌ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!


Also Read: IND vs SA: గబ్బర్‌ను పక్కన పెడితే అన్యాయమే! మిస్టర్‌ ఐసీసీనే పక్కన పెట్టేస్తారా?


Also Read: IND vs SA, KL Rahul: టీమ్‌ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌


Also Read: Watch: ఊ.. అంటావ్‌ మామా! ఈ జింక పిల్ల గోల్‌ చూస్తే అనక తప్పదు మామా!!


Also Read: IND Vs SA: కెప్టెన్సీ రచ్చ అంతా సోషల్‌ మీడియాలోనే..! మస్తు ఎంజాయ్‌ చేస్తున్న ద్రవిడ్‌, కోహ్లీ!