ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. హోరాహోరీగా తలపడుతున్న రెండు జట్లు.. ఆట ముగిసే సమయం దగ్గరపడింది.. అయినా గోల్సేమీ కాలేదు.. అలాంటప్పుడు ఆఖరి నిమిషంలో ఏ జట్టైనా గోల్‌ కొడితే ఎంత కిక్కొస్తుందో తెలుసు కదా!


స్టేడియంలోని అభిమానులు ఎగిరి గంతులు వేస్తారు. ఇక ఆటగాళ్లైతే మైదానమంతా పరుగులు తీస్తూ సంబరాలు చేసుకుంటారు. ఒకర్నొకరు హత్తుకుంటారు. ఆ సీన్‌ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది.


సరిగ్గా ఇదే సీన్‌ రిపీట్‌ చేసింది ఓ జింక పిల్ల! ఆఖరి నిమిషంలో గోల్‌ చేసి అంతెత్తున ఎగిరి సంబరాలు చేసుకుంది. ఈ జింకపిల్ల గోల్‌ కొట్టిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. లక్షల్లో లైకులు.. వేలల్లో షేర్లు లభిస్తున్నాయి.






నిజానికి ఈ వీడియో 2019 నాటిది. అప్పట్లోనే సంచలనం సృష్టించింది. తాజాగా మళ్లీ దీనిని ఒకరు ట్వీట్‌ చేయగా కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కరోనా డెల్టా వేరియెంట్‌ కాస్త చల్లబడ్డప్పుడు ఫుట్‌బాల్‌ మ్యాచులు బయో బుడగల్లో జరిగాయి. తాజాగా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విజృంభించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ మ్యాచులు నిలిచిపోయాయి.






ఇంగ్లాండ్‌లో ప్రీమియర్‌ లీగులో ఈ వారం జరగాల్సిన పది మ్యాచులను వాయిదా వేశారు. మాంచెస్టర్‌ యునైటెడ్‌పై ఎక్కువ ప్రభావం పడింది. బ్రెంట్‌ఫోర్డ్‌ మిడ్‌వీక్‌, సౌథాంప్టన్‌తో మ్యాచులు ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో ఈ వీడియో వైరల్‌గా మారాయి. స్పెయిన్‌లోనూ వైరల్‌ కేసులు ఎక్కువ అవ్వడంతో  లా లీగా పరిస్థితి సందిగ్ధంలో పడిపోయింది.


Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్‌ రోహిత్‌' మర్చిపోలేని 2021


Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021


Also Read: IPL Media Rights Tender: బీసీసీఐకి డబ్బుల పండగ! రూ.50వేల కోట్లు వస్తాయన్న గంగూలీ.. రంగంలోకి రిలయన్స్‌?


Also Read: Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో పతకం ఖాయం.. సెమీస్‌కు చేరిన తెలుగు తేజం!


Also Read: Hockey Men's Asian Champions Trophy: శెభాష్‌ భారత్‌..! పాక్‌ను ఓడించి సెమీస్‌ చేరిన హాకీ ఇండియా


Also Read: India U19 team: కుర్రాళ్లకు రోహిత్‌ పాఠాలు..! జోరు మీదున్న కొత్త కెప్టెన్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి