భారత క్రికెట్ నియంత్రణ మండలి 'బీసీసీఐ' మరో జాక్‌పాట్ కొట్టనుంది! ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ.40,000 కోట్లు ఆర్జించనుంది. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమాగా ఉన్నాడు. త్వరలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తామని వెల్లడించాడు. 'బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా' షోలో దాదా మాట్లాడాడు.
'రెండు కొత్త ఫ్రాంచైజీల విక్రయం ద్వారా రూ.12,000 కోట్లు రావడం అద్భుతం. ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా మరో రూ.40,000 కోట్లు వస్తాయి! త్వరలోనే బీసీసీఐ టెండర్లను ఆహ్వానించనుంది' అని గంగూలీ అన్నాడు. 'మొత్తంగా భారత క్రికెట్ రూ.50,000 కోట్లు వస్తున్నాయి. దీంతో భారత క్రికెట్‌ను బీసీసీఐ మరో స్థాయికి తీసుకెళ్లగదు. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా దేశ క్రికెట్ ఎంతో ప్రయోజనం పొందింది. ఈ డబ్బుతో ఇంక వేరే లెవల్‌కు ఆటను తీసుకుపోవచ్చు' అని దాదా ధీమాగా ఉన్నాడు.
ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం ఈ-వేలం నిర్వహిస్తామని గంగూలీ తెలిపాడు. 'హక్కులను విక్రయించేందుకు ఈ-వేలమే అత్యుత్తమ విధానమని మేం భావిస్తున్నాం. కొత్త జట్ల విక్రయం మాదిరిగానే ఐపీఎల్ ప్రసార హక్కుల వేలానికి అద్భుత స్పందన వస్తుందని ఆశిస్తున్నాం' అని ఆయన అన్నాడు.
మొదట్లో ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ దక్కించుకుంది. ఆ తర్వాత నిర్వహించి వేలంలో 2018-2022 హక్కులను స్టార్ ఇండియా కైవసం చేసుకుంది. ఇందుకు రూ.16,347 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు మరో రెండు జట్లు పెరిగాయి. మ్యాచుల సంఖ్య 60 నుంచి 75+కు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సారి సోనీ, స్టార్ మాత్రమే కాకుండా మరిన్ని సంస్థలు తీవ్రంగా పోటీ ఇవ్వనున్నాయి. రిలయన్స్ ప్రమోట్ చేస్తున్న వయాకామ్ హక్కులు దక్కించుకొనేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. అమెజాన్ సైతం ప్రధాన పోటీదారే!
Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021
Also Read: David Warner: మనసులు గెలిచిన వార్నర్.. ఏం చేశాడంటే?
Also Read: Ganguly on Virat Kohli: 'బోత్ ఆర్ నాట్ సేమ్..!' గంగూలీ వద్ద కోహ్లీ తప్పని నిరూపించే సాక్ష్యాలు?
Also Read: Kohli vs Ganguly: వేర్వేరు మాటలెందుకో? ఆ సంగతి గంగూలీనే అడగాలన్న సన్నీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి