ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్భుతం చేశాడు. క్రికెట్ మైదానంలో సూపర్ మ్యాన్ ఫీట్ దించేశాడు! తనకు దూరంగా వెళ్తున్న బంతిని భూమికి సమాంతరంగా డైవ్ చేసి అందుకున్నాడు. దాంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
యాషెస్ సిరీసులో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండో టెస్టులో తలపడుతున్నాయి. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ డే/నైట్ గులాబి టెస్టులో మొదట ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మార్కస్ హ్యారిస్ క్రీజులో ఉండగా ఎనిమిదో ఓవర్ మూడో బంతిని స్టువర్ట్ బ్రాడ్ విసిరాడు. ఛాతీ మీదకు వచ్చిన బంతిని హ్యారిస్ లెగ్‌సైడ్ వైపు ఆడాడు. తనకు దూరంగా వెళ్తున్న బంతిని అందుకొనేందుకు కీపర్ జోస్ బట్లర్ ముందుగా రెండడుగులు కుడివైపు వేసి భూమికి సమాంతరంగా గాల్లోకి ఎగిరాడు. కష్టపడి బంతిని అందుకున్నాడు.
అద్భుత క్యాచ్ అందుకున్న బట్లర్‌ను కామెంటేటర్లు తెగ పొగిడేశారు. 'సూపర్ మ్యాన్' అంటూ ప్రశంసించారు. ఈ సీజన్లోనే అత్యుత్తమ క్యాచ్‌గా పేర్కొన్నారు. బ్యాటర్ ఆడిన బంతి లెగ్‌సైడ్ వైపు వెళ్తుందని ముందే గమనించిన బట్లర్ తెలివితేటలు, అంచనా వేసే పద్ధతి అమోఘమని కొనియాడారు. తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 169/1తో ఉంది. డేవిడ్ వార్నర్ (89) సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరో ఆటగాడు మార్నస్ లబుషేన్ (69) అతడికి తోడుగా ఉన్నాడు. కంగారూలు భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.
Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్ వన్!
Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు
Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్
Also Read: Ravindra Jadeja Test Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో జడ్డూ..???
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి