టీమ్‌ఇండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని సమాచారం. అతడు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సమాలోచనలు చేస్తున్నాడని తెలిసింది. గాయాల పాలవ్వకుండా తన కెరీర్‌ను పొడగించుకోనేందుకు ఇలా చేయబోతున్నాడని అంటున్నారు. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకరు. మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. పైగా అంతర్జాతీయంగా బెస్ట్‌ అథ్లెట్‌. విరామం లేకుండా క్రికెట్‌ ఆడతాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో జడ్డూ ఎక్కువగా గాయపడుతున్నాడు. అందువల్లే న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ఆడలేదు. ఇంకా పూర్తిగా కోలుకోక పోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ పర్యటనకు ఎంపిక చేయలేదు.


ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు జడేజా ఆలోచిస్తున్నాడని దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త రాసింది. ఇక అతడి కెరీర్‌ విషయానికి వస్తే జడ్డూ 57 టెస్టులు, 168 వన్డేలు, 55 టీ20 మ్యాచులు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 2195 పరుగులు 232 వికెట్లు, వన్డేల్లో 2411 పరుగులు, 188 వికెట్లు, టీ20 క్రికెట్లో 232 పరుగులు, 46 వికెట్లు సాధించాడు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో చెన్నై సూపర్‌కింగ్స్‌కు జడ్డూ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సారి ఆ జట్టు అతడిని రూ.16 కోట్లతో రీటెయిన్‌ చేసుకుంది. కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కన్నా ఇది ఎక్కువ ధర కావడం గమనార్హం. భవిష్యత్తులో అతడిని సారథి చేయాలన్న ప్రణాళికతో సీఎస్‌కే ఉందని తెలిసింది.


Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్‌! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్‌ వన్‌!


Also Read: India's Test squad: షాక్‌..! కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌కు గాయం.. టెస్టు సిరీసు నుంచి ఔట్‌


Also Read: Virat Kohli: వన్డే సిరీస్ నుంచి కోహ్లీ అవుట్? కారణం అదే!


Also Read: Kohli Vs Rohit: ఒకళ్లుంటే మరొకళ్లు ఆడరా... ఇలా అయితే టీమిండియాకు కష్టమే!


Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు


Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి