భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడబోవడం లేదని తెలుస్తోంది. జనవరిలో వ్యక్తిగత కారణాల కారణంగా తనకు బ్రేక్ కావాలని విరాట్ కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ విరాట్ డిమాండ్‌ను ఒప్పుకున్నట్లయితే.. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు విజయావకాశాలు మెరుగవుతాయి.


వన్డేలకు కొత్త కెప్టెన్‌గా నియమితుడైన విరాట్ కోహ్లీ కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నానని, తను ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండబోనని తెలిపారు. టీ20లకు కెప్టెన్‌గా ఉండబోనని ప్రకటించిన అనంతరం కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది.


ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలకు, టీ20లకు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇప్పుడు తనకు గాయం కావడంతో టెస్టు సిరీస్‌కు దూరం అయినట్లు తెలుస్తోంది.


దక్షిణాఫ్రికా టూర్‌కు వన్డే జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ బీసీసీఐ.. విరాట్ కోహ్లీకి సెలవు ఇస్తే.. తన స్థానంలో జట్టుకు ఎవరు వస్తారో చూడాల్సి ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో ఎంతో మంది యువ ఆటగాళ్లు మెరుగ్గా పెర్ఫార్మ్ చేస్తున్నారు.


వీరిలో కొంతమందికి దక్షిణాఫ్రికా టూర్‌లో అవకాశం రావచ్చని తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ స్థానంలో గుజరాతీ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్‌ను జట్టుకు ఎంపిక చేశారు. రోహిత్ ఈ టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా నియమితుడయ్యాడు. మరి ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో కూడా తెలియాల్సి ఉంది.


Also Read: Yuvraj Singh Birthday: ప్రపంచంలో ఈ రికార్డు యువీనే మొదలెట్టాడు! నీతో గడిపిన మధుర క్షణాలు మళ్లీమళ్లీ రావాలంటున్న సచిన్‌


Also Read: Watch Video: నేనూ తలైవా ఫ్యానే అంటున్న వెంకటేశ్‌ అయ్యర్‌..! సెంచరీ చేయగానే స్టైల్‌గా రజనీకి సెల్యూట్‌!!


Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్‌..! వచ్చే ఐపీఎల్‌ను...?


Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్‌


Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?


Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి