టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత వరుస ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటుంది. సినిమాలతో పాటు 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటించింది. నిజానికి కొన్నాళ్లుగా సమంత ఎక్కువగా హోమ్లీ రోల్స్ లోనే కనిపించింది. 'జాను' సినిమాలో కూడా ఎంతో పద్దతిగా కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసింది. 'పుష్ప' స్పెషల్ సాంగ్ లో సమంత అందాల ఆరబోత మాములుగా చేయలేదు.


 
'ఊ అంటావా.. మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా సమంత గెటప్ చూసిన ఫ్యాన్స్.. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సాంగ్ లో నటించడానికి సమంత ఎంత తీసుకుందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఒక్క పాట కోసం సమంతకు రూ.1.2 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. నిజానికి సమంత ఒక్కో సినిమాకి రూ.3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. 


కానీ ఒక్క ఐటెం సాంగ్ కోసం ఆమెకి దాదాపు సినిమాకిచ్చే రెమ్యునరేషన్ లో సగం ఇచ్చేశారు. అది కూడా నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే. అంటే.. సమంతకు బాగా గిట్టుబాటైంది. ఇక ఈ పాట చిత్రీకరణకు కూడా బాగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో లావిష్ సెట్ ను ఏర్పాటు చేశారు. 'పుష్ప' సినిమాలో ఈ పాట ఒక హైలైట్ గా నిలుస్తుందని ఆశిస్తున్నారు. 


ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో పాటలు, ట్రైలర్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు బన్నీ. 


Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?


Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో


Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది


Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?


Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?


Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి