'బిగ్ బాస్' సీజన్ 5 తెలుగు టైటిల్ మానస్ నాగులపల్లి నెగ్గుతాడా? లేదా? అనేది ప్రస్తుతానికి చెప్పలేం! కానీ, అతడికి అంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లడానికి ముందు అతడు హీరోగా సినిమాలు చేశాడు. అందులో 'క్షీర సాగర మథనం' ఒకటి. తెలుగునాట థియేటర్లలో విడుదల అయ్యింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు.
మానస్ నాగులపల్లి 'బిగ్ బాస్ 5'కు వెళ్లడం వలన అదే సమయంలో ఓటీటీ విడుదల అయిన 'క్షీర సాగర మథనం' సినిమాకు కలిసొచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూశారు. ఈ సినిమాలో మానస్ నాగులపల్లితో పాటు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ రావ్ కూడా హీరో. అక్షతా సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణం. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ సంస్థతో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. త్వరలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా డబ్బింగ్ చేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు. మానస్ నాగులపల్లి 'బిగ్ బాస్ 5' విన్నర్వి కావాలని తమ చిత్రబృందం కోరుకుంటోందని అనిల్ పంగులూరి చెప్పారు. మరోవైపు మానస్ విజేత కావాలని, అతడికి ఓట్లు వేయమని ప్రముఖ దర్శకుడు మారుతి ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చిందిAlso Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాపబుల్... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి