" ఆడవారి మాటలకు అర్థాలే వేరులే "  అని అడ్వాంటేజ్ తీసుకోవడం మగవారిలో అత్యధికులు చేసే పని. అదే వైఫ్ అయితే ఇక ఆలోచించనే ఆలోచించరు. టేకిట్ గ్రాంటెడ్ అన్నట్లుగా ఉంటారు. నో అంటే నో అని అసలు అసలు అనుకోరు. నో అన్నా..ఎస్ అన్నా ... ఎస్ అనే అర్థం తీసుకుని ప్రొసీడ్ అయిపోతారు. కానీ నో అంటే స్ట్రిక్ట్‌లీ నో అనుకునే మహిళలు ఇలాంటి చొరవను అసలు సహించరు. చివరికి భార్య అయినా కూడా. 


Also Read: గచ్చిబౌలిలో భారీ లూటీ.. ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీనే బురిడీ కొట్టించి..


మధ్యప్రదేశ్‌లో ఓ భార్యను.. ఓ భర్త ఇలాగే  బలవంతం చేయబోయాడు. కానీ భార్య నో చెప్పింది. కానీ భర్త మాత్రం .. తన భార్య తనకు నో చెప్పడం ఏమిటని రెచ్చిపోయాడు. బలవంతంగా శృంగారం చేయడానికి సిద్ధమైపోయాడు. కానీ ఆ భార్య మాత్రం ఎంత బలవంతం చేసినా తన నో అనే కాన్సెప్ట్‌కే సిద్ధపడి.. తనను తాను రక్షించుకోవడానికి ఎవరూ చేయని పని చేసింది. భర్త పురుషాంగాన్ని కత్తి తీసుకుని కట్ చేసేసింది. 


Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!


బలవంతంగా శృంగారం చేసినా చేయించుకుంటుందని ... అంతా అయిపోయిన తర్వాత కావాలంటే ముఖం దాచుకుని ఏడుస్తుందని అనుకున్న ఆ భర్తకు జీవితంలో కోలుకోలేని షాక్ తగిలింది. ఇక నుంచి బర్త అని చెప్పుకోవడానికి.. మగ వాడ్ని అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. దీంతో ఆ భర్త లబోదిబోమంటూ ఆస్పత్రికి పరుగెత్తాడు. మెడికలో లీగల్ కేసు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 


Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?


మధ్యప్రదేశ్ జంటకు మూడేళ్ల క్రితమే పెళ్లయింది. కారణం ఏమిటో కానీ ఇద్దరి మధ్య ముందు నుంచీ సఖ్యత లేదు. ఓ సారి విడిపోతే.. తల్లిదండ్రులు కలిపారు. భర్త కలిసిపోదామని ప్రయ.త్నించినా భార్యకు నచ్చలేదు. చివరికి అలా వారి సంసారం.. అలా ఎండ్ అయిపోయింది. అందుకే మహిళలు నో అంటే నో అనే భర్త అయినా గుర్తు పెట్టుకోవాలని సూచించేఘటన ఇది. 


Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి