టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ నేడు 40 వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆటగాడిగా అతడందించిన సేవలను అభిమానులు, మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే యువీకి మాత్రమే సొంతమైన ఓ రికార్డును విజ్డెన్‌ ఇండియా ట్వీట్‌ చేసింది.






యువీ అంటేనే ప్రపంచకప్‌ల ఆటగాడు! ఏదైనా మెగాటోర్నీలో గనక అతడు విజృంభిస్తే ఇక టీమ్‌ఇండియాకు తిరుగులేనట్టే. 2007 టీ20 అరంగేట్ర ప్రపంచకప్‌లో అతడి విధ్వంసాలను అందరూ చూశారు. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌లో అతడి ఆటను ఎంత అభినందించినా తక్కువే! తిరుగులేని రికార్డులు నెలకొల్పి జట్టుకు రెండోసారి ప్రపంచకప్‌ అందించాడు. ఈ టోర్నీలో అతడు 300 పైచిలుకు పరుగులు చేశాడు. 15 వికెట్లు పడగొట్టాడు. ఒక వన్డే ప్రపంచకప్‌లో ఇలాంటి ఘనత అప్పటి వరకు ఎవ్వరూ నెలకొల్పలేదు.






'హ్యాపీ బర్త్‌డే యువీ! మైదానం లోపలా, బయటా నీతో అద్భుతమైన క్షణాలు గడిపాను. అలాంటి మధుర క్షణాలు మరెన్నో రావాలి' అని యువీకి సచిన్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు. '402 అంతర్జాతీయ మ్యాచులు, 11,778 పరుగులు, 148 వికెట్లు, 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌ల విజేత... యువీకి హ్యాపీ బర్త్‌డే' అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. 'మైదానం లోపలా, బయటా అతడో యోధుడు. పల్టాన్‌.. యువీ పాజీకి బర్త్‌డే విషెస్‌ చెప్పండి' అని ముంబయి ఇండియన్స్‌ పోస్టు పెట్టింది. ఇంకా సోషల్‌ మీడియాలో అభిమానులు తమకు నచ్చిన చిత్రాలను పెడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.














Also Read: Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!


Also Read: Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం


Also Read: Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!


Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!


Also Read: Ruturaj Gaikwad: ఎప్పుడో ఐపీఎల్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.. ఇంకా ఆపలా.. రుతురాజ్ మరో రికార్డు


Also Read: Yuvraj Singh NFT: బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చిన యువరాజ్ సింగ్.. తన విలువైన ట్రోఫీలు ఎన్‌ఎఫ్‌టీ చేస్తూ కీలక నిర్ణయం