సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పూర్తి స్థాయి జట్టును నిర్మించుకొనే పనిలో నిమగ్నమైంది! మొదట కోచింగ్‌, సహాయ సిబ్బందిని ఎంపిక చేయనుంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా స్పీడ్‌ స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా తీసుకోనుందని తెలిసింది. ఇక కోచ్‌గా టామ్‌ మూడినే ఉండనున్నాడు. బ్యాటింగ్‌ సలహాదారుగా హేమంగ్‌ బదానీ కోసం ప్రయత్నిస్తోందని సమాచారం.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో బలమైన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి. 2016లో ట్రోఫీ గెలిచిన ఆ జట్టు తర్వాత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌ చేరుకొని సత్తా చాటింది. అలాంటిది రెండేళ్లుగా పూర్తిగా విఫలమైంది. ఈ సారి ఏకంగా కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ పైనే వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా తుది జట్టులోనూ చోటివ్వలేదు. ఇక స్టార్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌ దూరమయ్యాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, కశ్మీర్‌కు చెందిన ఇద్దరు యువ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది.


బౌలింగ్‌ కోచ్‌గా డేల్‌ స్టెయిన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా కుదిరితే హేమంగ్‌ బదానీ బ్యాటింగ్‌ సలహాదారు అవుతాడు. జట్టును సమర్థంగా నడిపించిన టామ్‌ మూడీకే ప్రధాన కోచ్‌ పదవి ఇవ్వనున్నారు. అయితే మెంటార్‌గా ఎవరిని నియమించుకుంటారో ఇంకా తెలియదు! ఎందుకంటే ఇన్నాళ్లూ ఆ పదవిలో ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత క్రికెట్‌ భవిష్యత్తు కోసం ఎన్‌సీయే చీఫ్‌గా వెళ్లాడు.  మరి బౌలింగ్‌ సలహాదారుగా ఉన్న ముత్తయ్య మురళీధరన్‌ అందుబాటులో ఉంటాడో లేదో తెలియడం లేదు.


ఏదేమైనా సన్‌రైజర్స్‌ బలంగా మారాలంటే చాలా కష్టపడాల్సిందే. మెరుగైన ఓపెనర్లు, సత్తాగల మిడిలార్డర్‌, వికెట్లు తీసే బౌలర్లను ఎంచుకోవాలి. జట్ల సంఖ్య పెరగడంతో వేలంలో పోటీ విపరీతంగా ఉండనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌కు బౌలింగ్‌ దళమే వెన్నెముక. ఈ సారి అలాంటి బృందం దొరకడం కష్టమే!


Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్‌! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్‌ వన్‌!


Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు


Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్


Also Read: Virat Kohli press conference: కెప్టెన్సీ నుంచి తొలగించేందుకూ ఆప్షన్‌ ఇచ్చా! గంగూలీ మాత్రం అప్పుడు ఆపలేదన్న విరాట్‌?


Also Read: Ravindra Jadeja Test Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో జడ్డూ..???


Also Read: Virat Kohli-Rohit sharma rift: విరాట్‌, రోహిత్‌ వివాదంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..! డ్రస్సింగ్‌ రూమ్‌లో ఏం జరుగుతోందో ఆయనకు తెలుసా??


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి