మార్వెల్ స్పైడర్‌మ్యాన్ సిరీస్‌లో మూడో సినిమా ‘నో వే హోమ్’ గురువారం థియేటర్లలో విడుదల అయింది. 2000 దశకంలో వచ్చిన స్పైడర్‌మ్యాన్, 2010వ దశకంలో వచ్చిన అమేజింగ్ స్పైడర్‌మ్యాన్‌ల్లోని హీరోలు కూడా ఇందులో ఉంటారని వార్తలు వచ్చాయి. ఆ సినిమాల్లోని విలన్లు కూడా ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లలో కనిపించారు. వీరితో పాటు డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఈ సినిమాలో ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి ఈ స్పైడర్ ఆ అంచనాలను అందుకున్నాడా? అభిమానుల ఊహాగానాలు నిజం అయ్యాయా?
కథ: దీనికి ముందు భాగం అయిన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రం హోం క్లైమ్యాక్స్‌లో పీటర్ పార్కర్ ఐడెంటిటీ ప్రపంచానికి రివీల్ అవుతుంది. దీంతో ప్రజలందరూ పీటర్‌ను విలన్‌లా చూడటం మొదలు పెడతారు. దీంతో ప్రజలు తానే స్పైడర్ మ్యాన్ అనే విషయం మర్చిపోయేలా చేయమని పీటర్ పార్కర్.. డాక్టర్ స్ట్రేంజ్‌ను కోరతాడు. దీనికోసం స్ట్రేంజ్ ఒక మంత్ర ప్రయోగం చేస్తాడు. కానీ మధ్యలో ఆ మంత్ర ప్రయోగం వికటిస్తుంది. దాని పరిణామాలేంటి? మిగతా ప్రపంచాల్లోని స్పైడర్ మ్యాన్ విలన్లు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మిగతా స్పైడర్‌మ్యాన్‌లు కూడా తనకు సాయం చేయడానికి వచ్చారా? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ: మార్వెల్ స్పైడర్‌మ్యాన్ సినిమాలు గతంలో వచ్చిన స్పైడర్‌మ్యాన్ చిత్రాల స్థాయిలో లేవనే విమర్శలు గతంలో చాలా వినిపించాయి. దీనికి తోడు ఐరన్ మ్యాన్ సపోర్ట్ కోసం చూస్తూ ఉంటాడని.. ఈ స్పైడర్‌మ్యాన్ స్వతంత్రంగా వ్యవహరించలేడని, నిర్ణయాలు తీసుకోలేడని కూడా ఎంతో మంది విమర్శించాడు. ఈ ఒక్క చిత్రంతో వాటన్నిటికీ మార్వెల్ సమాధానం చెప్పింది. ఇప్పటి వరకు స్పైడర్ మ్యాన్ సినిమాలన్నిటిలో ఇదే ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్పైడర్‌మ్యాన్‌లో నాయకత్వ లక్షణాలను కూడా చూపించారు.
యాక్షన్ సన్నివేశాల విషయంలో వంక పెట్టడానికే లేదు. సినిమాలో మూడు యాక్షన్ సన్నివేశాలే ఉన్నప్పటికీ.. వాటిని ఎంతో ఎఫెక్టివ్‌గా తెరకెక్కించారు. గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఫీస్ట్ అని చెప్పవచ్చు. గూస్‌బంప్స్ తెప్పించే కొన్ని సన్నివేశాల గురించి చెప్తే ఎక్కువ రివీల్ చేసినట్లు ఉంటుంది.. అందుకే ఎక్కువ ప్రస్తావించడం లేదు. దర్శకుడు జాన్ వాట్స్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలోని ఎమోషనల్ సీన్లను బాగా హ్యాండిల్ చేశారు.
ఇక పీటర్ పార్కర్‌గా నటించిన టామ్ హాలండ్ ఈ సినిమాలో ప్రధాన హైలెట్. యాక్షన్ సన్నివేశాల్లో ఎంత అద్భుతంగా నటించాడో.. ఎమోషనల్ సీన్లలో అంతకు మించిన నటనను కనపరిచాడు. మిగతా నటులందరూ తమ పరిధిలో పాత్రలకు ప్రాణం పోశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే.. కామిక్ బుక్స్ మీద వచ్చిన బెస్ట్ సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ వారాంతంలో పుష్ప టికెట్లు దొరక్కపోతే నో వే హోం ట్రై చేయవచ్చు. కాకపోతే ఈ సినిమా పూర్తిగా అర్థం కావాలంటే.. దీనికి ముందు 2002-07 మధ్య వచ్చిన మూడు స్పైడర్ మ్యాన్ సినిమాలు, 2012-14ల మధ్య వచ్చిన అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్, 2017, 2019లో వచ్చిన స్పైడర్ మ్యాన్‌లతో పాటు 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్, అవెంజర్స్ సినిమాలు కూడా చూడాల్సి ఉంటుంది. ఇవి చూడకపోయినా.. థియేటర్‌కు వెళ్లి యాక్షన్ సీన్లు ఎంజాయ్ చేసి రావచ్చు.
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి