'పుష్ప: ద రైజ్' సినిమాలో సమంత స్టెప్స్ వేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా... ఊఊ అంటావా' పాట మీద పురుషుల సంఘం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఆ పాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒడిలో కూర్చుని సమంత వేసిన స్టెప్ వైరల్ అవుతోంది. మరోవైపు పాటలో సాహిత్యం మీద కొందరు పురుషులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసింది. అయితే... ఇప్పుడు ఆ సాంగ్‌కు సపోర్ట్‌గా ఓ మహిళా మండలి రంగంలోకి దిగింది.
Also Read: మాకు లేవా మనోభావాలు.. సమంత స్పెషల్ సాంగ్ పై పురుషుల సంఘం కేసు
అమరావతిలోని తాళ్లూరు గ్రామంలో కోదండరామ ఆలయంలో 'ఊ అంటావా... ఊఊ అంటావా' పాటలో డాన్స్ చేసిన సమంతకు, ఆ పాట రాసిన గేయ రచయిత చంద్రబోసుకు స్థానిక మహిళామండలి సభ్యులు అర్చన చేశారు. అలాగే, వారి ఫొటోలకు పాలతో అభిషేకం చేశారు. అనంతరం పురుషులది దురహంకారమని, ఈ పాట మీద కేసు వేయడం దుశ్చ్యర్య అని మండిపడ్డారు. పురుషుల దురహంకారాలు, దుశ్చర్యలను ఎండగట్టే పాట మీద వివాదాన్ని రాజేసిన పురుష సంఘానిది వంకరబుద్ది అని దుయ్యబట్టారు. మహిళల ఐకమత్యం వర్థిల్లాలని నినాదాలు చేశారు. అంతే కాదు... 'పుష్ప' సినిమాను తొలి రోజు చూస్తామని, 'ఊ అంటావా' పాటకు ఈలలు వేసి, చెప్పట్లు కొడతామని చెప్పారు.
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మించిన 'పుష్ప' ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: ఎందుకీ తెల్లగెడ్డం రాజమౌళి? నాతో సినిమా ఎప్పుడు? - బాలకృష్ణ ప్రశ్న! మీసం తిప్పిన రాజమౌళి!
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి