స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లోనే ముగిశాయి. యూఎస్‌ ఫెడ్‌ భయాలు వెంటాడటంతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. పైగా నెగెటివ్‌ సెంటిమెంట్‌ ఇందుకు తోడైంది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 300కు పైగా పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 17300 దిగువన ముగిసింది. మార్కెట్లు ఇకపైనా ఒడుదొడులకు లోనయ్యే అవకాశం ఉంది.


మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం రోజు ముగింపు 58,117తో పోలిస్తే నేడు 58,122 వద్ద మొదలైంది. ఆరంభంలోనే నష్టాలబాట పట్టింది. కాస్త పుంజుకొని 58,218 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ మరికాసేపటికే విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంది. 57,671 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ 329 పాయింట్ల నష్టంతో 57,788 వద్ద ముగిసింది.


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపు 17,324 కన్నా ఒక పాయింటు దిగువన 17,323 వద్ద మొదలైంది. 17,351 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. మరింత ఒడుదొడులకు లోనవుతూ 17,192 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి చివరికి 103 పాయింట్ల నష్టంతో 17,221 వద్ద ముగిసింది.


బ్యాంకు నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 36,929 వద్ద ఆరంభమైన సూచీ 37,083 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. ఆపై 36,743 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 36,789 వద్ద ముగిసింది.


నిఫ్టీలో సన్‌ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌, మారుతీ, టాటా కన్జూమర్స్‌, ఎం అండ్‌ ఎం లాభపడగా బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌ నష్టాల్లో ముగిశాయి. ఆటోను మినహాయిస్తే మిగతా అన్ని రంగాల సూచీలు ఎరుపు రంగులోనే కదలాడాయి.


Also Read: Netflix vs Amazon: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?


Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్


Also Read: Upcoming Budget EVs: కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి!


Also Read: Elon Musk: ఆ క్రిప్టోకరెన్సీని పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తానన్న ఎలాన్ మస్క్.. ఏ కాయిన్ అంటే?


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. రూ.130 తగ్గిన పసిడి ధర.. నిలకడగా వెండి, నేటి ధరలు ఇవీ..


Also Read: Petrol-Diesel Price, 15 December: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రో, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల.. నేటి ధరలు ఎంతంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి