టాలీవుడ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ ఇచ్చిన జీవో నెం.35ను సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది . ఈ తీర్పుపై వెంటనే ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. టిక్కెట్ రేట్ల తగ్గింపును సమర్థించుకుంది. అన్ని వివరాలు పరిశీలించిన తరవాతనే.. సౌకర్యాలను బట్టి టిక్కెట్ రేట్లను ఖరారు చేశామని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే తీర్పు కాపీ రాకపోవడంతో ధర్మాసనం విచారణ చేపట్టలేకపోయింది. తక్షణం విచారణ జరపకపోతే టిక్కెట్ రేట్లను యాజమాన్యాలు పెంచుతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం ఉదయం తొలి కేసుగా విచారణ జరుపుతామని ఏజీకి హైకోర్టు ధర్మానసం తెలిపింది.
Also Read : బాలయ్యతో లెజెండరీ దర్శకుడు రాజమౌళి... త్వరలో ప్రోమో విడుదల
ఏప్రిల్ నెలలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ రిలీజయింది. టిక్కెట్ రేట్లను తగ్గించడంతో ఆ సినిమా కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత పెద్ద సినిమాలేమీ విడుదల కాలేదు. కరోనా సెకండ్ వేవ్ పూర్తయిన తర్వాత ఆంక్షలు సడలించినా పెద్ద సినిమాలు ఇంకా ల్యాబుల్లోనే ఉండిపోయాయి. దీనికి కారణం.. టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావనే. ఆ వివాదం సమసిపోవడానికి టిక్కెట్ రేట్లు పెంచుకునేలా నిర్ణయం వచ్చే వరకూ వేచి చూస్తున్నారు.
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
ఈ లోపు ధియేటర్ యజమానులు న్యాయపోరాటం ప్రారంభించారు. టిక్కెట్ రేట్లను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని వారు వాదించారు. గతంలోలా కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ రేట్లను పెంచుకునే అవకాశం తమకు కల్పించాలని వారు కోరారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వారి వాదనను సమర్థించి ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది.
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
టాలీవుడ్‌లో వరుస బడా సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఏపీలో టిక్కెట్ రేట్లను పెంచితేనే వాటికి బిజినెస్ గిట్టుబాటవుతుంది. ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే ఉత్తర్వులపై టాలీవుడ్ ఫేట్ ఆధారపడి ఉంది.
Also Read: 'తప్పని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు'.. 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి