హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజ సమయంలో పూలు వినియోగించడం ఎప్పటినుంచో వస్తోన్న ఆచారం. పూజకు పూలకోసం చాలామంది ఇంటిముందు కనిపించే చెట్లు నందివర్థనం, గన్నేరు. వీటిలో గన్నేరు పూల మొక్కలైతే కేవలం ఇళ్లముందే కాదు ఎక్కడంటే అక్కడే ఉంటాయి. రోడ్లు పక్కన కూడా విరివిగా కనిపిస్తాయి. మరికొందరు పూజకోసం కాకపోయినా అందంకోసం పెంచుతారు.  ఇవి ఎరుపు, తెలుపు, గులాబీ, పసుపు వర్ణంలో పూస్తాయి. ఈ పూలను అమ్మవారికి, శ్రీ చక్రం పూజకు, శివుడికి  ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా శ్రీ చక్రాన్ని గన్నేరు పూలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. 
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
ఆరోగ్యానికి ఎర్రగన్నేరు
ముఖ్యంగా  ఎర్ర గన్నేరు మొక్క ఆకులు విషపూరితంగా ఉంటాయి. గన్నేరులో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రసాయనాలు ఉండడం వల్ల విశపుతత్వం ఉంటుంది. అందుకే గన్నేరును పొరపాటున కూడా కడుపులోకి తీసుకోకుండా పై పూతగా వాడొచ్చు. ఎర్ర గన్నేరు పూలతో కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వినియోగిస్తుంటారు. గన్నేరు ఆకులను బాగా కడిగి నీటిలో ఉడికించిన తర్వాత ఆ ఆకులను నొప్పులున్న ప్రదేశంలో పట్టులా కడితే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. గజ్జి, దురద, తామరకి మంచి పరిష్కారం కూడా. ఎర్ర గన్నేరు ఆకులు, పూలను  కలిపి మెత్తగా పేస్ట్ గా చేసి నువ్వులనూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టాలి. ఈ నూనెను సమస్య ఉన్న ప్రాంతంలో రాసి రెండు గంటలు అయ్యాక స్నానం చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే చర్మ సమస్యలకి పరిష్కారం లభిస్తుందట. వీటిని కేవలం శరీరంపై ఉండే సమస్యలకు మాత్రమే వినియోగించాలి..ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు తీసుకోరాదు..
Also Read:ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి