టీమ్‌ఇండియా టీ20 సారథ్యం వదిలేస్తున్నప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదన్న విరాట్‌ కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. దీనిపై మాట్లాడేందుకు ఏమీ లేదన్నాడు. వ్యవహారాన్ని బీసీసీఐకి వదిలేయాలని, అన్నీ అదే చూసుకుంటుందని వెల్లడించాడు.


దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై స్పందించాడు. రోహిత్‌తో తనకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. సఫారీ టెస్టు సిరీసుకు జట్టు ఎంపిక చేసే గంటన్నర ముందు తనకు సెలక్టర్లు కాల్‌ చేశారని వివరించాడు. జట్టును ఎంపిక చేశాక ఆఖర్లో తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినట్టు సెలక్టర్లు చెప్పారని వివరించాడు.


టీ20 కెప్టెన్సీ వదిలేసినప్పుడు వ్యక్తిగతంగా వద్దని వారించినట్టు గంగూలీ మీడియాకు చెప్పడంపైనా కోహ్లీ స్పందించాడు. తన వీడ్కోలు ప్రకటనను బీసీసీఐ స్వాగతించిందని, జట్టు పురోగతికి  మేలు జరుగుతుందని పేర్కొందన్నాడు. తనను ఇప్పటి వరకు బోర్డులో ఎవరూ సంప్రదించలేదని, ఎవరూ ఏమీ చెప్పలేదని వెల్లడించాడు. దాంతో గంగూలీ, కోహ్లీ మాటల మధ్య వైరుధ్యం కనిపించింది.


ఇదే విషయాన్ని గంగూలీని మీడియా గురువారం ప్రశ్నించింది. 'నేను చెప్పేందుకేమీ లేదు. మేం దీన్ని డీల్‌ చేస్తాం. ఈ సంగతి బీసీసీఐకి వదిలేయండి' అని దాదా అందుకు బదులిచ్చాడు. కాగా విరాట్‌ కోహ్లీ మాటలు అవాస్తవమని నిరూపించేందుకు బీసీసీఐ వద్ద అన్ని సాక్ష్యాలూ ఉన్నాయని తెలిసింది. అటు కోహ్లీ, ఇటు బోర్డు అప్రతిష్ఠ పాలవ్వకుండా వివరాలు వెల్లడించే వ్యూహం రచిస్తున్నారని సమాచారం. 


కెప్టెన్‌ కోహ్లీ మాటలు బోర్డుకు ఆగ్రహం తెప్పించాయని, పరిస్థితి సున్నితంగా ఉండటంతో సరైన స్పందన వ్యూహంతో ముందుకు రానుందని కొన్ని వర్గాలు ద్వారా తెలిసింది. విరాట్‌ మాటలు నిజం కావని నిరూపించే సాక్ష్యాలు బయటపెడితే అభిమానుల వద్ద అతడి పరువు పోతుందని బోర్డు ఆలోచిస్తోందట.  ఏమీ చెప్పకపోతే బోర్డుదే తప్పనుకుంటారని భావిస్తోందట.


Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్‌! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్‌ వన్‌!


Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు


Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్


Also Read: Virat Kohli press conference: కెప్టెన్సీ నుంచి తొలగించేందుకూ ఆప్షన్‌ ఇచ్చా! గంగూలీ మాత్రం అప్పుడు ఆపలేదన్న విరాట్‌?


Also Read: Ravindra Jadeja Test Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో జడ్డూ..???


Also Read: Virat Kohli-Rohit sharma rift: విరాట్‌, రోహిత్‌ వివాదంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..! డ్రస్సింగ్‌ రూమ్‌లో ఏం జరుగుతోందో ఆయనకు తెలుసా??


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి