తిరుపతిలో అమరావతి రైతులు శుక్రవారం నిర్వహించబోతున్న బహిరంగసభ  తెలుగుదేశం పార్టీ రాజకీయ సభ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఓ సామాజికవర్గ దోపిడీ కోసం అమరావతి రాజధాని పేరుతో చేస్తున్నదానిని త్యాగం అని ఎలా అంటారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో టీడీపీ వారు మాత్రమే పాల్గొన్నారని స్వచ్చందంగా ఒక్క రైతు కూడారాలేదన్నారు.   29 గ్రామాలను, ఓ సామాజికవర్గాన్ని  అభివృద్ధి చేయడం టీడీపీ అజెండా అని ..  13 జిల్లాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం వైఎస్ఆర్‌సీపీ అజెండా అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల ప్రజల  మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లాలనుకోవడం తమ పార్టీ విధానమన్నారు. 


Also Read: సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన... ఉద్యోగులు ఆందోళనను వాయిదా వేసుకోవాలి


అమరావతి రైతుల త్యాగాలు అంటున్నారని... నాగార్జునసాగర్, పోలవరం కోసం రైతులు భూములు ఇచ్చారని వారిది త్యాగం కాదా అని చంద్రబాబును బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.   కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే కార్యక్రమాలను ఆలోచన చేసి, తన సామాజిక వర్గం కోసమే చేసింది త్యాగం అంటారా? అని బొత్స విమర్శించారు.  తాము ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదన్నారు.  ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడమే తమ పార్టీ విధానమని తెలిపారు. టీడీపీ విధానం తప్పు అనే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని బొత్స తెలిపారు.  


Also Read:సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చిన కండువా వేయాల్సింది నేనేనంటూ పరిటాల శ్రీరాం హాట్ కామెంట్స్


 గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల మేరకు అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని..  ఇంకా వారికి మెరుగైన ప్యాకేజీని ఇస్తున్నామని బొత్స ప్రకటించారు.  మేము చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వేదం అని డిక్టేట్ చేద్దామనుకుంటే ప్రజాస్వామ్యంలో కుదరదని స్పష్టం చేశఆరు.  ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలంతా అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నారంటూ అచ్చెన్నాయుడు చెబుతున్నారని.. ఎవరు ఆమోదించారో ఆయనే చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. 


Also Read:  సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!


హైదరాబాద్‌ను తానే డెవలప్‌ చేశానని చంద్రబాబు ఎప్పుడూ డబ్బా కొట్టుకుంటారని..  కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రాంతంపైనే దృష్టి పెట్టి, బిల్డింగులు కట్టి, మిగతా 23 జిల్లాలనూ పక్కనపెట్టబట్టే  టీడీపీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు.  హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు.  పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మాటలను గ్రంథాల్లో నుంచి తీసుకువచ్చి... త్యాగం.. త్యాగం అని అంటున్నారని విమర్శించారు. తిరుపతిలో జరగబోయేది టీడీపీ సామాజికవర్గం సభగా తేల్చేశారు.  సభను అడ్డుకునేందుకు వైయస్సార్‌ సీపీ సానుభూతిపరులు కుట్ర చేస్తున్నారని అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. . మీరే అల్లర్లు చేసుకుని, దాన్ని ప్రభుత్వంపై రుద్దే కుట్ర చేస్తున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.  


Also Read: Jagan Governer : మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోండి.. ఏపీ గవర్నర్‌కు ముఖ్యమంత్రి సూచన !
 
 రాయలసీమ పరిరక్షణ సమితి చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వానికి సంబంధం లేదని బొత్స ప్రకటించారు.  అమరావతి ఉద్యమం చంద్రబాబు అధికారం నుంచి దిగాక వచ్చిందని.. దానికి దీనికి పోలికేంటని ప్రశ్నించారు.   తమ విధానాన్ని మార్చుకున్నామని బీజేపీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.  పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 


Also Read : అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి