ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. కరోనా బారిన పడిన గవర్నర్ రెండు విడతలుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలోచికిత్స పొందారు. మూడు రోజులకిందటే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి  విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. సతీమణి భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు.


Also Read : అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ


గవర్నర్ దంపతుల ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. 0కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ కు ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండవద్దని పూర్తి స్థాయిలో స్వస్థత చేకూరే వరకూ విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇరువురి మధ్య రాష్ట్ర అంశాలపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. 


Also Read: Chandru Chandrababu : కొంత మంది పేటీఎమ్‌ బ్యాచుల్లా తయారయ్యారు.. జడ్జిలుగా రిటైరై నేరస్తులకు సపోర్ట్ చేస్తారా ? .. చంద్రబాబు విమర్శలు


ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ. నాలుగు వందల కోట్లను ప్రభుత్వం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో బలవంతంగా డిపాజిట్ చేయించుకుంది. ఈ విషయంపై సోమవారం వరకూ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్నాతకోత్వసం కూడా వాయిదా పడింది. ఈ క్రమంలో ఉద్యోగులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ కు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీ వచ్చి సమాధానం చెప్పినట్లుగా తెలిసింది.


Also Read : దేవుడున్నాడు ! టిక్కెట్ల వివాదంపై జగన్‌ ఊతపదంతోనే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ !


ఈ వివాదంలో రూ. 175 కోట్లను తిరిగి ఎన్టీఆర్ వర్శిటీకి  ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెబుతున్నారు. మరో వారంలో ఆ నిధులను ఎన్టీఆర్ వర్శిటీకి జమ చేస్తారని హమీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఈ వివాదాలతో పాటు ఇంతర అంశాలపైనా గవర్నర్ వివరాలు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read : టిక్కెట్ జీవో సస్పెన్షన్‌పై డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్.. టాలీవుడ్‌ను మళ్లీ టెన్షన్‌లోకి నెట్టిన ఏపీ సర్కార్ !


Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి