ముంబయి డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ షరతులలో కొన్నింటికి కోర్టు మినహాయింపు ఇచ్చింది.







ఇక నుంచి ప్రతి శుక్రవారం ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయంలో ఆర్యన్ ఖాన్ హాజరుకావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ కేసు దిల్లీలోని ఎన్‌సీబీ నేతృత్వంలోని సిట్‌కు బదిలీ కావడంతో ముంబయి ఎన్‌సీబీ కార్యాలయంలో హాజరుకావాలన్న షరతును సడలించాలంటూ ఆర్యన్ ఖాన్.. బాంబే హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశాడు.


అయితే దిల్లీ ఎన్‌సీబీ అధికారులు ఎప్పుడు సమన్లు పంపినా ఆర్యన్ ఖాన్ హాజరుకావాలని కోర్టు సూచించింది. అలానే విచారణ కోసం ఆర్యన్ ఖాన్‌ను పిలవాలంటే 72 గంటల ముందే సమాచారం ఇవ్వాలని ఎన్‌సీబీకి కోర్టు తెలిపింది.


దిల్లీలోని ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన వివరాలను సమర్పించాలన్న నిబంధనల్లో మార్పులు చేసింది కోర్టు.


ఇదే కేసు..


ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో అక్టోబర్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడ్డాయి. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 


ఎన్‌సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది.


Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి


Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి