కరోనా  కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల అభ్యసన పరిస్థితులపై నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ ఒక సర్వే నిర్వహించింది. మొత్తం పదిహేను వందల రెండు (1502) మంది విద్యార్థులను ప్రత్యేక ప్రశ్నావళితో కరోనా టైంలో ఏర్పడిన లెర్నింగ్ లాస్,  లెర్నింగ్ పావర్టీని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతం నుంచి 416 మంది విద్యార్థులు ,సెమీ అర్బన్ నుంచి 155 మంది విద్యార్థులు పట్టణ ప్రాంతం నుంచి 860 మంది విద్యార్థులు, 36 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఈ సర్వేలో పాల్గొన్నారు. 3, 5, 8 వ తరగతిలో విద్యార్థులలో లెర్నింగ్ లాస్, లెర్నింగ్ పావర్టీని అంచనా వేశారు. 


కరోనా తర్వాత పట్టణ ప్రాంతాల్లో 30 శాతం మంది విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం విద్యార్థులు తమ మాతృభాషను నేర్చుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లీషు చదవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నార. ఇంగ్లీష్ చదవడంలో అన్ని ప్రాంతాల్లో మూడో తరగతి విద్యార్థులు 35% మంది వెనుకబడి ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ స్కూల్‌ మినహా ఇంగ్లీష్‌లో రాయడం, అర్థం చేసుకోవడం సమస్యగా మారింది. 


మ్యాథ్స్ విషయానికి వస్తే 44 శాతం మంది మూడో తరగతి విద్యార్థులు పట్టు కోల్పోయారు. 42 శాతం ఐదో తరగతి విద్యార్థులు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్న 34 శాతం మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు కూడా ఈ సబ్జెక్ట్‌లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని తరగతుల్లో ఈ సమస్య ఉందని సర్వేలో తేలింది. ప్రతి ముగ్గురిలో ఒకరు గణితంలో వెనుకబడి ఉన్నారు ..


ఆన్‌లైన్‌ తరగతుల విషయానికి వస్తే 1502 మంది విద్యార్థులలో 1260 మంది విద్యార్థులు జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ లాంటి వేదికలను ఉపయోగించినట్టు తెలిసింది. ఇవి ఇంటరాక్టివ్ విధానం గా చెప్పవచ్చు. ఇందులో విద్యార్థులకు తమ టీచర్ల ను సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. నాన్ ఇంటరాక్టివ్ బోధనాలైన యూట్యూబ్, దూరదర్శన్ ఇంకా టీ సాట్ దాదాపు 60 మంది అంటే కేవలం నాలుగు శాతం మంది విద్యార్థులకు ఉపయోగపడింది. మొత్తంగా 44.6 శాతం మంది విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో చదవడం కూడా కష్టంగా ఉందని తెలియజేశారు. 32.8 శాతం మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువు కొనసాగించడం లేదని తెలియజేశారు. 45.1 శాతం మంది విద్యార్థులు తమకు ఆన్లైన్ తరగతులు ద్వారా వచ్చిన లెర్నింగ్ లాస్ పూడ్చడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు. విద్యార్థులు చాలాకాలంపాటు ఇంటికే పరిమితమవ్వడం వల్ల ఇంటి వాతావరణం కూడా తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని అభిప్రాయపడ్డారు.


Also Read: టిక్కెట్ జీవో సస్పెన్షన్‌పై డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్.. టాలీవుడ్‌ను మళ్లీ టెన్షన్‌లోకి నెట్టిన ఏపీ సర్కార్ !


Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్


Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి