కల్వకుర్తి ఆయకట్టు విషయంలో కొత్తగా ఆయకట్టు పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఆయకట్టు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను.. జతచేస్తూ.. కేఆర్ఎంబీకి ఈఎన్సీ మురళిధర్ లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రెండు కాంపోనెంట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌లో పొందుపరచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. 2 అంశాలను ఒకటిగా పొందుపరచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచినా.. నీటి కేటాయింపులు పెంచలేదని కేఆర్ఎంబీకి తెలంగాణ చెప్పింది. అయితే కొత్త ఆయకట్టును పెంచలేదని.. పెరిగిన.. ఆయకట్టుకు సరిపడేలా మాత్రమే.. నీటి కేటాయింపులు చేసినట్టు చెప్పారు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం శ్రీశైలం రిజర్వాయిర్ నుంచి +800 అడుగుల వద్ద నీటిని తీసుకునే విధంగా 2006లోనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట నివేదించిన డీపీఆర్‌లోనే ఉందని లేఖలో ప్రస్తవించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, హెచ్ఎన్ఎస్ఎస్, టీజీపీ ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట నివేదిస్తూ నాటి ప్రభుత్వం ఫుల్ రిజర్వాయర్ లెవల్ +885 అడుగుల వద్ద ఫుల్ రిజర్వాయర్ లెవల్ కు సమీప మట్టం వద్ద నీటిని తీసుకునేవిధంగా డిజైన్ చేసినట్టు తెలిపారని లేఖలో పేర్కొన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల కృష్ణా నది బేసిన్లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్ చేసినట్టు ఈఎన్సీ లేఖలో చెప్పారు. బేసిన్ అవతలివి కాబట్టి.. ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తి రిజర్వాయర్ మట్టం 885 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్ చేశారని పేర్కొన్నారు.
ఇంకా ఇలాంటి కారణాలు చాలానే ఉన్నాయని.. వీటి దృష్ట్యా తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. గెజిట్ నోటిఫికేషన్ నుంచి కల్వకుర్తి రెండో భాగాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.
Also Read: Gay Marriage in Telangana: తెలంగాణలో తొలి ‘గే’ వివాహం.. మంగళ స్నానాలు, సంగీత్ అన్నీ..
Also Read: Kishan Reddy: నేను నాగలి కడతా.. నువ్వు కడతావా కేసీఆర్, ఆ పౌరుషం చూపాల్సిందే.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
Also Read: Shyam Singha Roy: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్యాం సింగరాయ్ మూవీ టీమ్