2021 ముగిసిపోతోంది. ఒక్కసారి ఏడాదిని తరిచి చూస్తే అందాల ప్రపంచాన్ని శాసించింది విటమిన్ ‘సి’ అనే అర్థమవుతుంది. బ్యూటీ ఉత్పత్తులలో విటమిన్ సి వాడకం అధికంగా పెరిగింది. అందాన్ని కాపాడడంలో తన వంతు పాత్రను సమర్థంగా నిర్వహించింది సి విటమిన్. పీల్ ఆఫ్ మాస్క్‌ల నుంచి ఫేస్ వాష్‌ల వరకు అన్నింటి తయారీలోనూ విటమిన్ సి వాడకం ఎక్కువైంది. విటమిన్ సి వాడకం పెరుగుతోంది అంటే ప్రపంచం సహజరక్షణా పద్ధతులకు పెద్దపీట వేస్తోందని అర్థమవుతోంది. ఇది నిజంగా భారీ మార్పుగానే భావిస్తున్నారు పరిశోధకులు. 


ఎండ నుంచి కాపాడడం
విటమిన్ సి వల్ల కలిగే ప్రయోజనాల్లో సూర్యుని వేడిని తట్టుకోవడం, ఆ కిరణాల వల్ల కలిగే నష్టాన్ని అడ్డుకోవడం ముఖ్యమైనవి. లేకుంటే మన చర్మం ఈపాటికి మాడిపోయిన మసాలా గారెలా అయిపోయి ఉండేది. చర్మానికి తీక్షణమైన సూర్యకిరణాల ధాటిని తట్టుకునే శక్తిని ఇచ్చేది విటమిన్ సి. 


హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది
 హైపర్ పిగ్మెంటేషన్ లేదా మచ్చలు, ప్యాచెస్‌లా ఏర్పడడం, చర్మం రంగు మారడం వంటి చాలా సమస్యలు కలుగుతాయి. వీటికి సరైన పరిష్కారం అందించేది విటమిన్ సినే. 


గీతలు పోతాయి
చర్మంపై సన్నని గీతలు ఏర్పడుతుంటాయి. వయసుతో పాటూ అవి వస్తుంటాయి. కొందరిలో మాత్రం పాతికేళ్లకే మొదలవుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న సీరమ్స్ ఈ ఫైన్ లైన్స్ పోగొట్టేందుకు సాయపడతాయి. 


హైడ్రేట్ చేస్తుంది
విటమిన్ సి చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. తేమ లేని చర్మాన్ని చూడలేం. ఎండిపోయి, పాలిపోయినట్టు అవుతుంది.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.  


Also read: పిల్లలు ఎత్తు పెరగాలా... ఈ ఆటలు ఆడించండి
Also read:   చపాతీలు రోజూ తింటున్నారా? చేసుకునే పద్దతి మార్చండి చలికాలంలో చాలా రోగాలను దూరం పెట్టొచ్చు
Also read: నిద్రను రానివ్వకుండా చేసే అలవాట్లు ఇవే... దూరం పెట్టకపోతే పెద్ద రోగాలు రావడం ఖాయం
Also read: గుడ్ న్యూస్... ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్‌కు చుక్కలు చూపిస్తుందట, మీరు ఇదే వేయించుకున్నారా?
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా, ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా... ఒమిక్రాన్ వచ్చేస్తోంది ఎలా?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి