"ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం... ప్రజలు మోసపోతూనే ఉంటారు" అని సత్యదేవ్ అంటున్నారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'గాడ్సే'. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తునున్నారు. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు (సోమవారం, డిసెంబర్ 20) మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.


టీజర్ చూస్తే... స‌త్య‌దేవ్‌ను పట్టుకోవడం కోసం ప్రభుత్వ, పోలీస్, అధికార యంత్రాంగాలు ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతోంది. గాడ్సే అనేది సినిమాలో సత్యదేవ్ అసలు పేరు కాదు. ఆ పేరుతో అతను ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే... రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. "రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? రైట్" అనే డైలాగ్ నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపించింది. సత్యదేవ్ ఈ డైలాగ్ చెప్పిన తర్వాత 'అది చెప్పే కదా! అధికారంలోకి వచ్చాం' అని '30' ఇయర్స్ పృథ్వీ అన్నారు.





"సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్ రా! ఎందుకంటే... మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీని లూటీ చేస్తున్నారు" అని ఆవేశంగా సత్యదేవ్ చెప్పిన డైలాగ్ రాజాకీయ నాయకుల అవినీతిని టార్గెట్ చేసేదే. ట్రైలర్ విడుదల అయితే సినిమా కాన్సెప్ట్ మీద మరింత క్లారిటీ వస్తుంది. సత్యదేవ్ డ్రస్సింగ్ బావుంది. ఇంతకు ముందు సత్యదేవ్, గోపి గణేష్ కాంబినేషన్ లో 'బ్లఫ్ మాస్టర్' సినిమా వచ్చింది. ఇప్పుడీ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read: 'ఆర్ఆర్ఆర్'ను ఆకాశానికి ఎత్తేసిన సల్మాన్ ఖాన్... ఆ నాలుగు నెలలు రిలీజులు వద్దట!
Also Read: 'లయన్ లాగా ఉన్నావ్ నాన్న'.. కొడుకు వీడియో షేర్ చేసిన నాని..
Also Read: బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Also Read: గాల్లోంచి అలా అలా... ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ అదుర్స్ అంతే! మీరూ వీడియో చూడండి!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి