టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం గర్ల్ గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తను క్యాన్సర్ తో పోరాడుతున్నానని చెప్పి షాకిచ్చింది హంసానందిని. అంతేకాదు.. కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయి గుండుతో కనిపించింది హంసానందిని.
నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్ లో లంప్ ఉన్నట్లుగా గుర్తించిన హంసానందిని వెంటనే డాక్టర్స్ ని కలిసి పలు టెస్ట్ లు చేయించుకుందట. అందులో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలిందట. డాక్టర్స్ బయోప్సీ చేయాలని చెప్పడంతో ట్రీట్మెంట్ తీసుకుందట. కొన్నేళ్లక్రితం తన తల్లి కూడా క్యాన్సర్ తో చనిపోయిందని.. అప్పటిరోజులు గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుందని.. ఇప్పుడు తనకు కూడా క్యాన్సర్ వచ్చిందని ఎమోషనల్ అయింది హంసానందిని. కానీ తను భయపడడం లేదని.. క్యాన్సర్ తో పోరాడి గెలుస్తానని నమ్మకంగా చెబుతోంది.
ట్రీట్మెంట్ లో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకోవాల్సి ఉందని చెప్పింది. తనకొచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు తక్కువ అని.. ఫ్యూచర్ లో మళ్లీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. కాబట్టి మరో మూడేళ్లపాటు ట్రీట్మెంట్ ను కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది.
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి