పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన.. న్యాయవిద్యార్థులకు న్యాయ పట్టాలు అందజేశారు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాహిత్యం, చరిత్ర తెలిసి ఉండాలన్నారు. ప్రశ్నించే తత్వాన్ని మరిచిపోవద్దని చెప్పారు. 
న్యాయం కోసం పోరాడేందుకు ఎప్పుడు ముందుండాలని యువతకు సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ చెప్పారు.


న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషి చేయాలని.. శక్తిని వినియోగించుకునే మార్గమే యువత భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని తెలిపారు.   నల్సార్‌ న్యాయవిశ్వవిద్యాలయంతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేస్కున్నారు. హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో కేవలం చిన్న భవనంతో ప్రారంభమైన కళాశాల ఇప్పుడు అత్యన్నత స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాచార మార్పిడి సమర్థంగా ఉండాలని చెప్పారు. న్యాయవిద్యార్థులు ప్రజాసమస్యలపై అవగాహన చేసుకోవాలని సూచించారు. 
Also Read: Bigg Boss 5 Prize Money: ‘బిగ్ బాస్’ విన్నర్‌ సన్నీకి ట్రోపీతోపాటు లభించేవి ఇవే.. ఈ సారి షన్నుకు కూడా..


న్యాయవిద్యను అభ్యసిస్తూ ఎన్నో విలువైన ఉపన్యాసాలు విని ఉంటారు. చిన్ననాటి నుంచి సామాజిక స్పృహ ఉంటేనే న్యాయ విద్యకు సార్థకత వస్తుంది. చట్టం తెలుసుకుంటే సమాజంలో క్రమశిక్షణగా మెలగడమే కాదు ఆలోచనలో స్పష్టత, కచ్చితత్వం అంచనా వేయడం కూడా తెలుస్తుంది. మాతృభాష గానీ మరే ఇతర భాషలలోనైనా సమాచార మార్పిడి సమర్థంగా ఉంటేనే న్యాయవాద వృత్తిలో రాణించొచ్చు. నిజాన్ని కనిపెట్టడం కష్టం కాదు. ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై వారి సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి. న్యాయవిద్యలో కోర్సులను ప్రారంభించాల్సిన అవసరం ఉంది -  జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి 


కోర్టు భవనాలు ప్రారంభం..
వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ జిల్లా కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ బుయాన్, రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావ్, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగరావు, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలిసి సీజేఐ కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు.
Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!
Also Read: Gold-Silver Price: రెండోరోజూ స్థిరంగా బంగారం.. నేల చూపులు చూసిన వెండి.. నేటి ధరలు ఇవీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి