నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ నెల 24న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా తొలుత ర‌వివ‌ర్మ‌న్‌ను అనుకున్నారు. అయితే... 'శ్యామ్ సింగ రాయ్' మొదలు అయినప్పుడు ఆయన దర్శకుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్'కు పని చేస్తున్నారు. అందువల్ల, నాని సినిమా చేయడం ఆయనకు కుదరలేదు. ఆ తర్వాత నాని సాను జాన్ వర్గీస్ పేరును సూచించడంతో ఆయన్ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. సంగీత దర్శకుడి విషయంలోనూ అదే విధంగా జరిగింది.


ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ 'శ్యామ్ సింగ రాయ్'కు సంగీతం అందిస్తే... బావుంటుందని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అనుకున్నారట. అయితే... ఆయన కూడా బిజీ. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'కు రెహమాన్ పని చేస్తున్నారు. ఆఫ్ కోర్స్... ఆయన చేతిలో మిగతా సినిమాలు కూడా ఉన్నాయి అనుకోండి. రెహమాన్ కూడా అందుబాటులో లేకపోవడంతో అప్పుడు మిక్కీ జే మేయర్ పేరును దర్శకుడు రాహుల్ సూచించారు. చివరకు, ఆయన సంగీతం అందించారు. అదీ సంగతి! మణిరత్నం సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఇద్దరు టాలెంటెడ్ టెక్నీషియన్లు 'శ్యామ్ సింగ రాయ్'కు దొరకలేదు. అయితే... సినిమాకు పని చేసిన వాళ్లు మంచి అవుట్ పుట్ ఇచ్చారు.


సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్'ను నిహారిక ఎంటర్‌టైర్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇందులో నాని డ్యూయల్ రోల్ చేశారు. ఒక రోల్ బెంగాల్ నేపథ్యంలో ఉంటుంది.


Also Read: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
Also Read: గాల్లోంచి అలా అలా... ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ అదుర్స్ అంతే! మీరూ వీడియో చూడండి!
Also Read: అరె.. ఈ ట్రోల్స్ ఏంట్రా? షన్ముఖ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్, నవ్వు ఆపుకోండి చూద్దాం!
Also Read: బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి