స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పని చేసి రిటైరైన మాజీ ఐఏఎస్ ప్రేమ్ చంద్రారెడ్డి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయన హయాంలోనే నిధులు మంజూరయ్యాయి. ఆయనే సంస్థకు ఎండీగా ఉన్నప్పటికీ .. డైరక్టర్‌గా ఉన్న ఘంటా సుబ్బారావు, మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణను ఏ - 1, ఏ -2గా పెట్టడం వివాదాస్పదమయింది. హైకోర్టులో కూడా సుబ్బారావు తరపు న్యాయవాదులు ఇదే అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిధులు విడుదల చేసిన మేనేజింగ్ డైరక్టర్‌ను ఎందుకు ప్రశ్నించలేదని హైకోర్టు సీఐడీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి స్థాయి అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది.
Also Read: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్
ఈ క్రమంలోసీఐడీ సీర్‌పీసీలోని సెక్షన్ 91, 160 కింద నోటీసులు జారీ చేశారు.. ఈ రెండు సెక్షన్లు సాక్షిగా మాత్రమే ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వమని విజ్ఞప్తి చేసేవి. సమాచారం కోసం పలు ప్రశ్నలు సంధిస్తూ ఏడు పేజీలు నోటీసు ఇచ్చింది. నిధుల విడుదలలో అప్పటి ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, చీఫ్ సెక్రటరీలు వారి పాత్ర ఏమిటని సీఐడి అధికారులు నోటీసుల్లో ప్రశఅనించారు. ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే తమకు అందచేయాలని ఆదేశించింది. మొత్తం 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీస్సులో సీఐడి అధికారులు పేర్కొన్నారు.
Also Read: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసుల సెర్చింగ్ ! అరెస్ట్ కోసమేనా ?
ఇదే తరహాలో మాజీ ఐఏఎస్ అధికారి, సీఎం జగన్‌కు సలహాదారుగా పని చేసిన పీవీ రమేష్‌కూ నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన లేకపోవడంతో కొత్త అడ్రస్‌కు స్పీడ్ పోస్టులో నోటీసులు పుంపుతామని సీఐడీ అధికారులు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు విడుదలైన సమయంలో పీవీ రమేష్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?
Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి