స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ స్కాం జరిగిందని సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ -1గా ఉన్న ఘంటా సుబ్బారావుకు హైకోర్టు షరతులతోకూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటలోపు మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది. సీఐడీ విచారణకు హాజరు కావాలంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలిపింది.
Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...
ఈ సందర్భంగా దర్యాప్తు అధికారికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అవినీతి జరుగుతుందని చెబుతున్నందున.. నిధుల విడుదల, నిర్ణయాలు తీసుకున్న కమిటీలో ఉన్న వారందరినీ కేసులో ఎందుకు చేర్చలేదని ధర్మాసనం సీఐీజని ప్రశ్నించింది. సుబ్బారావు నిధులు దుర్వినియోగం చేశారని ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. వీటిపై సీఐడీ తరపు న్యాయవాది స్పష్టమైన సమాధానాన్ని హైకోర్టుకు చెప్పలేదు.
Also Read: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ
అలాగే నిధుల విడుదల సహా మొత్తం కార్పొరేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేంది మేనేజింగ్ డైరక్టరని.. ఆయన కాకుండా.. ఓ డైరక్టర్‌గా ఉన్న ఘంటా సుబ్బారావు పేరను ఎలా ఏ- 1 చేరుస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కొంతమందిని కేసులో నిందితులుగా పేర్కొనడం పట్ల సుబ్బారావు తరపు న్యాయవాది ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమందిని కావాలని కేసులో ఇరికించారని సుబ్బారావు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
Also Read: ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?
స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ స్కాం జరిగిందని సీఐడీ కేసులు పెట్టింది. ఘంటా సుబ్బారావుతోపాటు మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణతో సహా పలువుర్ని నిందితులుగా చేర్చారు. అయితే నిధులు విడుదల చేసింది అప్పటి ఎండీ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి అని అలాగే నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు సీఎంవోలో కీలకంగా ఉన్న షంషేర్ సింగ్ రావత్, అజయ్ జైన్‌లు అని వారిని కాకుండా కేవలం సలహాలకు మాత్రమే పరిమితయ్యేవారిపై కేసులు పెట్టడం ఏమిటని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి