ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల కోసం, బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
విపక్షాల నిరసన..
ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సుప్రీం కోర్టు తీర్పును ఈ బిల్లను ఉల్లంఘిస్తోందని విమర్శించాయి. అంతేగాక పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని విపక్ష సభ్యులు ఆరోపించారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది సభ. అయితే ఆందోళనలో చర్చ చేపట్టే అవకాశం రాలేదు. అనంతరం సభను డిసెంబర్ 21వరకు వాయిదా వేశారు.
బిల్లులో ఏముంది?
- ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం.
- ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం.
- ఎన్నికల సంఘాన్ని మరింత బలోపేతం చేయడం.
- పాన్- ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తారు.
వ్యక్తిగత గోప్యత..
ఈ బిల్లు చట్టంగా మారితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశముందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం కచ్చితంగా చేసుకోవాలా లేక ప్రజలే స్వచ్ఛందందా అనుసంధానించుకునేలా ప్రక్రియ చేపడతారా అనే దానిపై స్పష్టత లేదు.
ఇంకా..
వీటితో పాటు ఏడాదిలో నాలుగు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించేలా మరో ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది.
Also Read: Aishwarya Rai Summoned: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ
Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి