తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఈ ఉదయం ఓ ఆటోకు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని స్థానికులు దాదాపు 14 మంది మహిళా కూలీలు ఆటోలో పత్తిపాడు మండలం తుమ్మల పాలెంలో పత్తి తీత పనుల కోసం బయలుదేరారు. యడ్లపాడు వద్దకు రాగానే ఆటోను ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఫలితంగా ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని.. బోల్తా కొట్టింది. 


ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 9 మందిని అంబులెన్స్‌లో స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షేక్ దరియాబి అనే 55 ఏళ్ల మహిళ, బేగం అనే 52 ఏళ్ల మరో మహిళ మృతి చెందారు. మిగతా ఏడుగురిలో మీనాక్షి అనే మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 


హైదరాబాద్ శివారులో మరో ప్రమాదం
జీహెచ్‌ఎంసీ శివారులోని బహదూర్‌పల్లి వద్ద అర్ధరాత్రి మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు మైసమ్మ గూడ వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్‌లోనే మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బహదూర్‌పల్లి నుంచి దూలపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడు బహదూర్‌ పల్లికి చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.


మెదక్‌లో..
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జీవిక కంపెనీ నుంచి ద్విచక్ర వాహనం బయటకి వస్తుండంగా అటుగా వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఉల్లితిమయిపల్లి  గ్రామానికి చెందిన పండ్ల రాకేష్ అనే 15 ఏళ్ల బాలుడు  అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి  పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో వారిద్దరికీ చికిత్స జరుగుతోంది. 


Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..


Also Read: KTR On PM Modi: అప్పుడు ప్రత్యక్ష నరకం చూపించి.. ఎన్నికల వేళ కూలీలతో భోజనం.. ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్!


Also Read: Weather Updates: బీ అలర్ట్.. రెండు వైపుల నుంచి వీస్తున్న చల్లగాలులు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ..!


Also Read: Gold-Silver Price: రెండోరోజూ స్థిరంగా బంగారం.. నేల చూపులు చూసిన వెండి.. నేటి ధరలు ఇవీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి