KTR Comments On PM Modi: చేనేత, వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డ్రామాలు చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. అందుకు సాక్ష్యాలివిగో అంటూ రెండు సందర్భాలను మనకు సూచిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇటీవల వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించారు. ఆ సందర్భంగా కారిడార్ కోసం పనిచేసిన కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆపై ఓ వేదిక వద్ద తన కోసం వేసిన కూర్చీని తీసివేసి మరీ ప్రధాని మోదీ ఆ కార్మికులతో కలిసి కూర్చోవడం హాట్ టాపిక్ అయింది. బీజేపీ వర్గాలు మోదీ సామాన్యుడిలా సేవలు అందిస్తున్నారని ప్రశంసించగా.. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల డ్రామాలు అని ఘాటుగానే ప్రధాని తీరును విమర్శించాయి. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ఈ విషయంపై స్పందించారు.  కూలీలపై మోదీ కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే తనకు ఆశ్చర్యం కలిగిందంటూ ప్రధానిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘ఎన్నికలు ఉంటే ఇలా.. కూలీలతో కలిసి భోజనం..లేకపోతే అలా.. వలస కూలీలను గాలికొదిలేసి, ప్రత్యక్ష నరకం’ చూపించారంటూ ప్రధాని మోదీ తీరుపై కేటీఆర్ ట్వీట్ ద్వారా విమర్శలు గుప్పించారు.






కరోనా వ్యాప్తి చెందినప్పుడు విధించిన లాక్‌డౌన్ సమయంలో లక్షాలాది కూలీలు, వలస కార్మికులు వందల కిలోమీటర్లు కాలినడకన స్వగ్రామాలకు నడిచిన సమయంలో వారిపై మీ ప్రేమ కలగలేదు. పైగా స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో ఛార్జీలు సైతం వసూలు చేసి ప్రత్యక్ష నరకం చూపించారు. మరి ఇప్పుడు కూలీలపై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందంటూ ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. యూపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మోదీ తన ట్రిక్కులు ప్లే చేస్తున్నారని ఇటీవల జాతీయ స్థాయిలో విపక్ష నేతలు విమర్శించగా.. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తన అభిప్రాయాన్ని అదే తీరుగా వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. 
Also Read: Weather Updates: బీ అలర్ట్.. రెండు వైపుల నుంచి వీస్తున్న చల్లగాలులు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ..!


Also Read: Gold-Silver Price: రెండోరోజూ స్థిరంగా బంగారం.. నేల చూపులు చూసిన వెండి.. నేటి ధరలు ఇవీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి