విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేయాలని వైసీపీ ఎంపీలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శలు చేశారు. ప్రాణ త్యాగాలైనా చేసి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఇటీవల విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ నేతలు చెప్పారని పవన్ గుర్తు చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'వైసీపీ ఎంపీలూ.. కనీసం ప్లకార్డులు పట్టుకోండి.. చాలు’ అని పవన్‌ అన్నారు. ప్రాణాలు తీసుకునేంత త్యాగాలు చేయక్కర్లేదని పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుంటే చాలని పవన్ ట్వీట్‌ చేశారు. 






Also Read: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...


జనసేన టిజిటల్ క్యాంపెయిన్


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రాణ త్యాగాలు కాదు.. కనీసం పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని నిరసన చేయాలని పవన్ చురకలంటించారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రాణ త్యాగాలు చేసైనా అడ్డుకుంటామని వైసీపీ నేతలు హామీలిచ్చారని గుర్తుచేశారు. అంత త్యాగాలు అక్కర్లేదు... కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలని వైసీపీ ఎంపీలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని పార్లమెంటులో వైసీపీ ఎంపీలు వినిపించాలని డిమాండ్ చేస్తూ జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ప్లకార్డులతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిరసన తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. 


Also Read:  ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ


అమలాపురంలో నిరసనలు


విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన సైనికులు వినూత్నంగా నిరసన చేపట్టారు. అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో వరుసగా నిలబడి  నినదించారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ పార్లమెంటులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. జనసేన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడాలని ఎంపీని జనసైనికులు కోరారు. 


Also Read: ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి