జగన్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేసిన మాజీ ఐఏఎస్ అెధికారి పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసులు గాలిస్తున్నారు . ఆయన కోసం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే పీవీ రమేష్ ఇంట్లో లేరు . దీంతో సీఐడీ పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. అరెస్ట్ చేయడానికే వచ్చారని పీవీ రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసులు ఎందుకు వచ్చారో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు.
Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?
పీవీ రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అత్యంత కీలకమైన పదవుల్లో పని చేశారు . తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. కీలక బాధ్యతలు ఇచ్చారు. రిటైరైన వెంటనే ఆయనను సలహాదారుగా నియమించారు. కరోనా మొదటి లాక్ డౌన్ సమయంలో ఆయన కీలకంగా పని చేశారు. మధ్యలో ఏం జరిగిందో కానీ ఆయనను తొలగించారు. అప్పట్నుంచి పీవీ రమేష్ సైలెంట్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు చేస్తూంటారు. అయితే నేరుగా ఎవర్నీ ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయరు.
పీవీ రమేష్ సోదరిని ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్ వివాహం చేసుకున్నారు. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. సునీల్ కుమార్‌పై ఆయన భార్య గృహ హింస కేసును నమోదు చేసింది. ఆ వివాదం ఉంది. ఇటీవల ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఫోన్ నుంచి పీవీ రమేష్ సోదరికి బెదిరింపు సందేశాలు వచ్చాయన్న విషయాన్ని బయట పెట్టారు.. అది కూడా వివాదాస్పదమయింది. తన ఫోన్ సీఐడీ స్వాధీనం చేసుకుందని... సీఐడీ అధికారులే పీవీ రమేష్, సోదరికి సందేశాలు పంపారని రఘురామరాజు ఆరోపించారు. ఆ వివాదం తర్వాత ఏమయిందో స్పష్టత లేదు.
Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...
అయితే హఠాత్తుగా పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసులు రావడం సంచలనంగా మారింది. అసలు ఆయనపై ఏమైనా కేసులు నమోదయ్యాయా..? అరెస్ట్ కోసం వచ్చారా..? లేకపోతే ఏదైనా సమాచారం కోసం వచ్చారా..? లాంటి అంశాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే పీవీ రమేష్‌ను అరెస్ట్ చేయడానికి సీఐడీ బృందం హైదరాబాద్ రాలేదని.. సీఐడీ ఓ ప్రకటన చేసింది. ఇటీవల నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో సీమెన్స్ సంస్థగురించి సమాచారం కోసం ఆయనను ప్రశ్నించడానికి హైదరాబాద్‌లోని ఇంటికి డీఎస్పీ స్థాయి అధికారి వెళ్లారని..కానీ అడ్రస్ మారిందని సీఐడీ చెప్పింది. అందుకే కొత్త అడ్రస్‌కు ప్రశ్నావళిని పోస్టులో పంపుతామన్నారు. అయితే కొత్త అడ్రస్ తెలిసినప్పుడు పాత అడ్రస్‌కు సీఐడీ బృందాన్ని పంపడం ఎందుకన్నది సస్పెన్స్‌గా మారింది. ఇటీవలి కాలంలో పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ ఐఏఎస్‌లనూ అరెస్ట్ చేస్తూండటంతో.. ఆయననూ అలాగే అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ సీఐడీ ప్రకటనతో క్లారిటీ వచ్చినట్లయింది.
Also Read: ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి