సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి క‌ల‌యిక‌లో సినిమా ఇప్పుడు కాదు... ఎప్పుడో ఖరారు అయ్యింది. వీళ్లిద్దరితో సినిమా చేయడానికి నిర్మాత కె.ఎల్. నారాయణ ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. అయితే... ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సమయం త్వరలో రానుంది. అటు మహేష్, ఇటు రాజమౌళి... ఇన్నాళ్లూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటంతో కలిసి సినిమా చేసే అవకాశం కుదరలేదు. ఇప్పుడు కుదురుతోంది.


'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత మహేష్ బాబు హీరోగా సినిమా చేయనున్నట్టు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా స్క్రిప్ట్ డిస్కషన్స్ మొదలు అయ్యాయి. "మహేష్ బాబుతో చేయబోయే సినిమా నాకు ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. స్క్రిప్ట్ సిట్టింగ్స్ మొదలు అయ్యాయి. మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ తో ఐడియాస్ డిస్కస్ చేస్తున్నాను. ఐడియాస్ ఎక్స్‌చేంజ్‌ చేసుకుంటున్నాం. అయితే... ప్రస్తుతానికి నా ఫోకస్ 'ఆర్ఆర్ఆర్' మీద ఉంది. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ తర్వాత మహేష్ సినిమా గురించి అప్‌డేట్‌ ఇస్తాను" అని రాజమౌళి పేర్కొన్నారు.
Also Read: SSMB28: దుబాయ్‌లో మ‌హేష్‌ను క‌లిసిన త్రివిక్ర‌మ్ అండ్ టీమ్‌
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఆ రెండు సినిమాలు 2022 ఎండింగ్‌కి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే రాజమౌళితో సినిమా మొదలు కావచ్చు. 'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత కొన్ని రోజులు రాజమౌళి విశ్రాంతి తీసుకుని, మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తిస్థాయిలో ప్రారంభించవచ్చు.  రాజమౌళి దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద‌ కొట్టిన రాజమౌళి
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి