నట సింహ నందమూరి బాలకృష్ణ, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని...  అటు నందమూరి అభిమానులు, ఇటు సామాన్య ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుందా? రాదా? వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఒకసారి బాలకృష్ణ హీరోగా సినిమా చేయాలని రాజమౌళి ప్రయత్నించారు. ఓసారి బాలయ్య దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పారు. అయితే... ఆ సినిమా సెట్ కాలేదు. ఆ తర్వాత అదే కథతో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి 'మగధీర' తీశారు. ఈ విషయాలను 'అన్ స్టాపబుల్' షోలో బాలకృష్ణ, రాజమౌళి పంచుకున్నారు.

'నాతో సినిమా చేయమని అభిమానులు అడిగితే... హ్యాండిల్ చేయలేనని అన్నారట. నాకు ఎందుకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు?' అని బాలకృష్ణ అడిగారు. 'మీతో సినిమా చేయడానికి నాకు భయం. భయం అంటే మీరు ఏదో చేస్తారని కాదు. మీకు మనుషులకు ఎంత గౌరవం ఇస్తారో తెలుసు. మీకు పద్దతి అంటే ఎంత పట్టింపో నాకు తెలుసు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. నాకు గుడ్ మార్నింగ్ చెబితే చిరాకు. షాట్ పెట్టినప్పుడు పక్కన హీరో ఎండలో నుంచున్నాడా? వానలో నించున్నాడా? నాకు తెలియదు. సినిమా తప్ప హీరో కష్టసుఖాలు నేను ఆలోచించలేను. మీతో చేయడానికి మీకు కోపం వస్తుందేమో అని టెన్షన్ తో చేయలేదు" అని రాజమౌళి సమాధానం ఇచ్చారు. "ఒక్కసారి కేర్ వ్యాన్ నుంచి బయటకు వస్తే... మళ్లీ లోపలకు వెళ్లనని, గొడుకు కూడా పెట్టను" అని బాలకృష్ణ చెప్పారు. ఆ తర్వాత డిస్కషన్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ వైపు, బసవతారకం ఆస్పత్రి వైపు మళ్లింది. అలా అలా ఓ పది పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నారు.
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!

'సామ్రాట్ అశోక్' సినిమాకు తాను దర్శకత్వం వహించాలని అనుకున్నాని బాలకృష్ణ తెలిపారు. "ముంబై వెళ్లి కాస్ట్యూమ్స్ కొలతలు కూడా ఇచ్చి వచ్చాను. చిత్రీకరణకు వెళ్లే ముందు నాన్నగారు (ఎన్టీఆర్) పిలిచి '35ఎంఎంలో సినిమా తీస్తున్నాం' అన్నారు. అక్కడే సగం చచ్చిపోయా. సరేనండి... క్లైమాక్స్ యుద్ధానికి పదివేల మంది కావాలన్నాను. 'ఓహో... ఇంకేం కావాలో?' అన్నారు. రెండువేల గుర్రాలు, రెండొందల ఒంటెలు కావాలని అన్నాను. ఇంకా ఇంకా అంటుంటే నాకు కాలింది. స్క్రిప్ట్ తీసి టేబుల్ మీద కొట్టి నేను సినిమా చేయడం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయా. మీరు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు కదా! నేను చేసింది తప్పా? ఒప్పా? చెప్పండి" అని బాలకృష్ణ అడిగారు. బాలయ్య చేసింది తప్పేనని రాజమౌళి అన్నారు. దర్శకుడిగా నిర్మాతను కన్వీన్స్ చేయాలని చెప్పారు. అన్నట్టు... ఆ 'సామ్రాట్ అశోక్' సినిమాకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. అలాగే ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'దాన వీర సూర కర్ణ' సినిమా గురించి డిస్కషన్ వచ్చింది. ఇదంతా పూర్తయిన తర్వాత "నేను మన కాంబినేషన్ గురించి అడిగితే... మా నాన్నగారి పేరెత్తి... నా వీక్ నెస్ మీద కొట్టి పావుగంట దాటించేశారు" అని బాలకృష్ణ అన్నారు. రాజమౌళి మహా మాయగాడు అన్నారు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ చూసిన హాలీవుడ్ సినిమాల గురించి కూడా డిస్కషన్ వచ్చింది.

Also Read: రౌడీ హీరోతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్..
Also Read: మ‌హేష్‌ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో స‌త్తా చాటాడోయ్!
Also Read: సన్నీకి 'ఐలవ్యూ' చెప్పిన అలియాభట్.. పాతిక లక్షలు ఆఫర్ చేసిన నాని..
Also Read: ఉనికి... మహిళా ఐఏఎస్ స్ఫూర్తితో తీసిన సినిమా!
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి