టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు దర్శకుడు సుకుమార్. కానీ ఆయన 'పుష్ప' సినిమాను ఎప్పుడైతే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారో.. ఇక విజయ్ దేవరకొండ సినిమా ఉండదేమోననే మాటలు వినిపించాయి. మరోపక్క విజయ్ కూడా వేరే ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటుండడంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సుకుమార్.
ఆయన డైరెక్ట్ చేసిన 'పుష్ప' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.71 కోట్ల గ్రాస్ ను సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. ఒక్క నైజాంలోనే 11.44 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టినట్లు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ సినిమాను మరింత ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం. ఇందులో భాగంగా సుకుమార్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
'పుష్ప' సినిమా సెకండ్ పార్ట్ గురించి మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని.. 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.
ఇదే సమయంలో ఆయనకు విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెట్టగలనని అన్నారు. నిజానికి జనవరి 2022 నుంచి విజయ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. కానీ ఇప్పుడు 'పుష్ప' పార్ట్ 2 విడుదలైతేనే గానీ విజయ్ దేవరకొండ సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు సుకుమార్. ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2022 ఆగస్టులో విడుదల కానుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
Also Read: ఉనికి... మహిళా ఐఏఎస్ స్ఫూర్తితో తీసిన సినిమా!
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి